T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం..!
అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం తెరపైకి వచ్చింది.

Match fixing in T20 World Cup_ Player approached with corrupt intentions
T20 World Cup 2024 – Match Fixing : అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం తెరపైకి వచ్చింది. కెన్యాకు చెందిన ఓ మాజీ క్రికెటర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ఉగాండా ఆటగాడిని సంప్రదించాడు. ఈ విషయాన్ని సదరు ఉగాండా ప్లేయర్ ఐసీసీ అవినీతి నిరోధక శాఖ అధికారులకు తెలియజేశాడు. వేరువేరు నంబర్ల ద్వారా అతడు ప్రయత్నించినట్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చాడు.
వెస్టిండీస్‌లోని గయానా వేదికగా ఉగాండా జట్టు మూడు మ్యాచులు ఆడింది. ఈ సమయంలోనే ఉగాండా ఆటగాడిని కెన్యా మాజీ పేసర్ సంప్రదించేందుకు ప్రయత్నించాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఐసీసీ సైతం ధ్రువీకరించింది. ఫిక్సింగ్ చేసేందుకు ఉగాండా ఆటగాడిని ఎన్నుకోవడంలో తమకు ఆశ్చర్యమేమీ లేదని ఐసీసీ వర్గాలు తెలిపాయి.
IND vs AFG : అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు.. టీమ్ఇండియాకు బిగ్ షాక్..!
ఎందుకంటే పెద్ద జట్ల ఆటగాళ్లతో పోలిస్తే అసోసియేట్ దేశాల ప్లేయర్స్‌ని వలలో వేసుకోవడం చాలా తేలిక. అయితే.. ఉగాండా ఆటగాడు వీలైనంత త్వరగా ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశాడు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపింది.
సదరు కెన్యా ఆటగాడి గురించి అన్ని అసోసియేట్ జట్లకు తెలియజేసింది. కాగా.. ఈ పొట్టి ప్రపంచకప్‌లో గ్రూప్ సిలో ఉన్న ఉగాండా జట్టు నాలుగు మ్యాచులు ఆడింది. ఒక్క దాంట్లోనే గెలిచింది.