Pakistan cricketer : భార్య చెబుతున్నా విన‌కుండా.. అభిమానితో గొడ‌వ‌కు దిగిన పాకిస్తాన్ స్టార్ క్రికెట‌ర్‌..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో పాకిస్తాన్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో గ్రూప్ స్టేజీలోనే ఇంటి ముఖం ప‌ట్టింది.

Pakistan cricketer : భార్య చెబుతున్నా విన‌కుండా.. అభిమానితో గొడ‌వ‌కు దిగిన పాకిస్తాన్ స్టార్ క్రికెట‌ర్‌..

Pakistan Star Haris Rauf Runs To Hit Trolling Fan Thinking He Is Indian

Pakistan Star Haris Rauf : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో పాకిస్తాన్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో గ్రూప్ స్టేజీలోనే ఇంటి ముఖం ప‌ట్టింది. దీంతో ఆ జ‌ట్టు పై విమ‌ర్శ‌ల జ‌డివాన కురుస్తోంది. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌మ ప్ర‌యాణం ముగిసిన‌ప్ప‌టికి కూడా కొంద‌రు పాక్ ఆట‌గాళ్లు స్వ‌దేశానికి వెళ్ల‌కుండా ఇంకా అమెరికాలోనే ఉన్నారు. పాకిస్తాన్ పేస‌ర్ హ్యారీస్ రౌఫ్ త‌న భార్య‌తో క‌లిసి అమెరికాలో షికార్లు కొడుతున్నాడు. అయితే.. అత‌డు ఓ అభిమానితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

భార్య‌తో క‌లిసి షికారుకు వెళ్లిన హ్యారీస్ రౌఫ్ పై ఫ్యాన్స్ మాట‌ల దాడికి దిగిన‌ట్లు ఓ వీడియోలో క‌నిపిస్తోంది. దీనికి పాక్ క్రికెట‌ర్ కూడా గ‌ట్టిగానే ప్ర‌తి స్పందించాడు. తాను ఓ క్రికెట‌ర్ అన్న విష‌యాన్ని మ‌రిచి అభిమానిపై దాడికి య‌త్నించాడు. అత‌డి భార్య వ‌ద్ద‌ని చెబుతున్నా కూడా ఎంత‌మాత్రం త‌గ్గ‌కుండా అభిమానిపైకి దూసుకువ‌చ్చాడు.

Rohit Sharma : 5 రోజుల వ్య‌వ‌ధిలో 3 మ్యాచులు.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కీల‌క వ్యాఖ్య‌లు..

ఇంకో వీడియోలో ఆ వ్య‌క్తిని స‌ద‌రు అభిమానిని భార‌త్‌కు చెందిన వాడ‌ని హ్యారీస్ అన్నాడు. అయితే.. స‌ద‌రు వ్య‌క్తి తాను పాకిస్తాన్ నుంచి వ‌చ్చిన‌ట్లుగా చెప్పుకొచ్చాడు. హ్యారీస్ రౌఫ్ ను అత‌డి భార్య‌, ఇత‌ర ఫ్యాన్స్ ఆపిన‌ట్లుగా వీడియో చూస్తే అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ఈ వీడియోలు వైర‌ల్‌గా మారాయి. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. అభిమాని పట్ల రౌఫ్‌ ప్రవర్తన చూసి సొంత దేశ అభిమానులు ‍కూడా అతన్ని అసహ్యించుకుంటున్నారు.

దేశం త‌రుపున ఆడేట‌ప్పుడు ఇలాంటివి స‌హ‌జం అని, ఇలాంటి వాటిని చూసి చూడ‌న‌ట్లుగా వ‌దిలివేయాల‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

BCCI : ఇదేంద‌య్యా ఇదీ.. మ‌రీ ఇంత దారుణ‌మా..! టీమ్ఇండియా కోచ్ ప‌ద‌వికి ఒక్క‌టే ద‌ర‌ఖాస్తు..! అది కూడా..