BCCI : ఇదేంద‌య్యా ఇదీ.. మ‌రీ ఇంత దారుణ‌మా..! టీమ్ఇండియా కోచ్ ప‌ద‌వికి ఒక్క‌టే ద‌ర‌ఖాస్తు..! అది కూడా..

ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నిక బోర్డు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ).

BCCI : ఇదేంద‌య్యా ఇదీ.. మ‌రీ ఇంత దారుణ‌మా..! టీమ్ఇండియా కోచ్ ప‌ద‌వికి ఒక్క‌టే ద‌ర‌ఖాస్తు..! అది కూడా..

Gautam Gambhir sole candidate for eam India Head coach job

BCCI- Team India Head coach : ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నిక బోర్డు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ). అలాంటి బీసీసీఐ టీమ్ఇండియా హెడ్ కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తే ఆద‌ర‌ణ క‌ర‌వైంది. ఒక్క‌టంటే ఒక్క‌టే ద‌ర‌ఖాస్తు వ‌చ్చిన‌ట్లుగా జాతీయ‌మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. మిగిలిన దేశాల బోర్డుల కంటే జీత‌భ‌త్యాలు, అల‌వెన్సులు ఎక్కువ‌గా ఇస్తున్న‌ప్ప‌టికీ కూడా టీమ్ఇండియా మాజీ ఆట‌గాళ్లు లేదా ఇత‌ర దేశాల దిగ్గ‌జ ఆట‌గాళ్లు ఎవ్వ‌రూ కూడా ఆస‌క్తి చూప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు గౌత‌మ్ గంభీర్ ఒక్క‌డే కోచ్ ప‌ద‌వి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లుగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. గంభీర్‌ను నేడు (మంగ‌ళ‌వారం) అశోక్ మల్హోత్రా, జతిన్ పరంజపే, సులక్షణ నాయక్‌ల‌తో కూడిన క్రికెట్ అడ్వైజ‌రీ క‌మిటీ జూమ్ కాల్ ద్వారా ఇంట‌ర్వ్యూ చేయ‌నున్న‌ట్లుగా పేర్కొంది. టీమ్ఇండియా హెడ్‌కోచ్‌తో పాటు సెల‌క్ట‌ర్‌ను ఎంపిక చేసే ప‌నిలో క్రికెట్ అడ్వైజ‌రీ క‌మిటీ ఉంది. అంకోలా స్థానాన్ని మ‌రో సెల‌క్ట‌ర్‌తో భ‌ర్తీ చేయ‌నుంది.

పూరన్ పవర్ హిట్టింగ్‌.. టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ రికార్డ్ సమం, క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు

కాగా.. కోచ్ ప‌ద‌వికి గౌత‌మ్ గంభీర్ ఒక్క‌డే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డంతో అత‌డి ఎంపిక లాంఛ‌న‌మే కానుంది. ర‌విశాస్త్రి త‌రువాత టీమ్ఇండియా కోచ్ బాధ్య‌త‌ల‌ను రాహుల్ ద్ర‌విడ్ చేప‌ట్టాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 నాటికే అత‌డి ప‌ద‌వికాలం ముగిసిపోయింది. అయితే.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 పూర్తి అయ్యే వ‌ర‌కు కొన‌సాగాల‌ని బీసీసీఐ విజ్ఞ‌ప్తి చేయ‌డంతో ఇందుకు ద్ర‌విడ్ అంగీక‌రించాడు. ఇప్పుడు పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ పూర్తి కావొస్తుండ‌డంతో ద్ర‌విడ్ వార‌సుడిని ఎంపిక చేస్తున్నారు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముగిసిన వెంట‌నే ద్ర‌విడ్ కోచ్ ప‌దవి నుంచి త‌ప్పుకుంటాడు. కొత్త‌గా బాధ్య‌త‌లు అందుకునే కోచ్ డిసెంబ‌ర్ 31, 2027 వ‌ర‌కు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నాడు. అందుతున్న స‌మాచారం బ‌ట్టి గౌత‌మ్ గంభీర్ టీమ్ఇండియా నూత‌న హెడ్ కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశం ఉంది.

టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పిన కివీస్ బౌలర్ లాకీ ఫెర్గూస‌న్‌.. వీడియో వైర‌ల్