IND vs AFG : అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు.. టీమ్ఇండియాకు బిగ్ షాక్..!
సూపర్ 8లో భాగంగా గురువారం అఫ్గానిస్తాన్ జట్టుతో భారత్ తలపడనుంది.

Suryakumar suffers injury scare ahead of Super Eight clash against Afghanistan
India vs Afghanistan : టీ20 ప్రపంచకప్ 2024లో భారత జట్టు అదరగొడుతోంది. గ్రూప్ స్టేజీలో వరుస విజయాలు సాధించి సూపర్ 8లోకి అడుగుపెట్టింది. మొన్నటి వరకు అమెరికా పిచ్‌లపై ఆడిన భారత్ ఇప్పుడు వెస్టిండీస్ పిచ్‌లపై ఆడాల్సి ఉంది. సూపర్ 8లో భాగంగా గురువారం అఫ్గానిస్తాన్ జట్టుతో భారత్ తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా ఆటగాళ్లు నెట్స్‌లో కష్టపడుతున్నారు.
అయితే.. ప్రాక్టీస్ సెషన్‌లో మిస్టర్ 360 డిగ్రీస్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అతడి చేతికి బంతి బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిలలాడాడు. వెంటనే ఫిజియో వచ్చి అతడి గాయాన్ని పరిశీలించాడు. నొప్పి తగ్గడం కోసం స్ప్రేను ఉపయోగించాడు. ఈ క్రమంలో కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న సూర్యకుమార్ మళ్లీ తన ప్రాక్టీస్‌ను కొనసాగించాడు.
అయితే.. సూర్యగాయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అతడి గాయం తీవ్రతపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ సూర్యకు అయిన గాయం తీవత్ర ఎక్కువగా ఉండి అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌కు అతడు దూరం అయితే టీమ్ఇండియాకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. పొట్టి ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచుల్లో అంతగా రాణించని సూర్య.. అమెరికాతో మ్యాచ్‌లో కీలక సమయంలో అద్భుత హాఫ్ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు.
ఇక లీగ్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఘోరంగా విఫలం అయ్యాడు. ఐర్లాండ్ పై ఒక్క పరుగు, పాకిస్తాన్ పై నాలుగు, అమెరికాతో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో ఫామ్‌లోకి రావాలని నెట్స్‌లో కోహ్లి తీవ్రంగా కష్టపడుతున్నాడు.
Rohit Sharma : 5 రోజుల వ్యవధిలో 3 మ్యాచులు.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..
భారత జట్టు సూపర్-8 షెడ్యూల్..
– జూన్ 20న అఫ్గానిస్థాన్ (బార్బడోస్)
– జూన్ 22న బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)
– జూన్ 24న ఆస్ట్రేలియా (లూసియా)
Surya Kumar Yadav was hit on his hand while taking throw downs. He’s back at the nets after First aid. pic.twitter.com/0vUxED4qvo
— Don Cricket ? (@doncricket_) June 17, 2024