Shubman Gill : శుభ్‌మ‌న్ గిల్ చేసేది అన్యాయం.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వ్యాఖ్య‌లు వైర‌ల్

టీమ్ఇండియా యువ ఆట‌గాడు శుభ్‌మ‌న్ గిల్ త‌న ప్ర‌తిభ‌కు న్యాయం చేయ‌లేక‌పోతున్నాడ‌ని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ స‌ల్మాన్ భ‌ట్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

Shubman Gill

Shubman Gill – Salman Butt : టీమ్ఇండియా యువ ఆట‌గాడు శుభ్‌మ‌న్ గిల్ త‌న ప్ర‌తిభ‌కు న్యాయం చేయ‌లేక‌పోతున్నాడ‌ని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ స‌ల్మాన్ భ‌ట్ అభిప్రాయ‌ప‌డ్డాడు. అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన రెండో టీ20 మ్యాచులో గిల్ బెంచీకే ప‌రిమితం కావ‌డం పై భ‌ట్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. య‌శ‌స్వి జైస్వాల్ అత‌డి స్థానంలో రెండో టీ20లో బ‌రిలోకి దిగాడు. అర్ధ‌శ‌త‌కంతో రాణించి త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని రెండు చేతుల‌తో ఒడిసి ప‌ట్టుకున్నాడు.

కాగా.. 2023లో గిల్ ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అద్భుత ఫామ్‌ను చాటుకున్నాడు. అయితే.. ఇటీవ‌ల అత‌డు విఫ‌లం అవుతున్నాడు. ద‌క్షిణాప్రికా ప‌ర్య‌ట‌న‌లో 2, 26, 36, 10 ప‌రుగుల‌తో పూర్తిగా నిరాశ‌ప‌రిచాడు. ఇక అఫ్గాన్‌తో జ‌రిగిన మొద‌టి టీ20 మ్యాచులో 12 బంతుల్లో 23 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో రెండో టీ20 మ్యాచులో జ‌ట్టులో చోటు కోల్పోయాడు.

Praggnanandhaa : ప్ర‌జ్ఞానంద సంచ‌ల‌నం.. విశ్వనాథ‌న్ ఆనంద్‌కు షాక్‌.. భార‌త టాప్ చెస్ ప్లేయ‌ర్‌గా..

దీనిపై భ‌ట్ త‌న యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. ‘గ‌త కొన్ని మ్యాచుల్లో గిల్ త‌న ప్ర‌తిభ‌కు అన్యాయం చేశాడ‌ని భావిస్తున్నాను. అత‌డు ఎంతో నైపుణ్యం క‌లిగిన ఆట‌గాడు. అయితే.. తొంద‌ర‌పాటు కార‌ణంగా ఔట్ అవుతున్నాడు. ఓ 20 ప‌రుగులు చేశాక క్రీజులో కుదురుకున్నాడు అని అనుకునే లోపే ఓ పేల‌వ షాట్ ఆడి పెవిలియ‌న్‌కు చేరుకుంటున్నాడు. గ‌తేడాది అత‌డు అద్భుతంగా ఆడాడు. ప్ర‌తీసారి అలా ఆడ‌లేదు. అత‌ను ప్ర‌త్యేకంగా ఏమీ చేయాల్సిన అవ‌స‌రం లేదు. కేవ‌లం బ్యాటింగ్ మాత్ర‌మే చేయాలి. ప్ర‌పంచంలో అత్యుత్త‌మ ఆట‌గాళ్ల‌లో ఎవ‌రైనా స‌రే ప్ర‌తి బంతిని ఇష్టానుసారంగా షాట్ ఆడ‌లేర‌నే విష‌యాన్ని గ‌మ‌నించాలి. బంతిని బ‌ట్టి మాత్ర‌మే షాట్ ఆడాల్సి ఉంటుంది.’ అని గిల్ అన్నాడు.

రెండో టీ20 మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత‌ బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 172 ప‌రుగులు చేసింది. అనంత‌రం య‌శ‌స్వి జైస్వాల్ (68; 34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), శివ‌మ్ దూబె (63నాటౌట్‌; 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) లు దంచికొట్ట‌డంతో ల‌క్ష్యాన్ని భార‌త్ 15.4 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజ‌యంతో భార‌త్ మూడు మ్యాచుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సొంతం చేసుకుంది.

NZ vs PAK : ఏమ‌య్యా.. 16 సిక్స్‌లు కొట్టావ్‌.. ఇంకొక్కటి బాదుంటేనా..?

 

ట్రెండింగ్ వార్తలు