Site icon 10TV Telugu

Babar Azam : ఆసియాక‌ప్‌లో నో ప్లేస్‌.. స్పిన్న‌ర్‌గా మారిన బాబ‌ర్ ఆజామ్‌.. సూప‌ర్ డెలివ‌రీతో క్లీన్ బౌల్డ్‌! వీడియో

Exhbition Match Babar Azam Turns Spinner To Dismiss Pakistan Great Younis Khan

Exhbition Match Babar Azam Turns Spinner To Dismiss Pakistan Great Younis Khan

Babar Azam : పేల‌వ ఫామ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న పాకిస్తాన్ స్టార్ ఆట‌గాడు బాబ‌ర్ ఆజామ్‌కు ఆసియాక‌ప్ 2025లో చోటు దక్క‌ని సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం పాక్ జ‌ట్టు ఆసియాకప్ 2025 స‌న్నాహాకాల్లో భాగంగా అఫ్గానిస్తాన్‌, యూఏఈల‌తో క‌లిసి ట్రై సిరీస్ ఆడుతోంది. ఈ జ‌ట్టులోనూ బాబ‌ర్ (Babar Azam) కు చోటు ద‌క్క‌లేదు. ప్ర‌స్తుతం బాబ‌ర్ ఖాళీగానే ఉన్నాడు.

వ‌ర‌ద బాధితుల‌కు విరాళాలు సేక‌రించేందుకు శ‌నివారం ఓ ఎగ్జిబిష‌న్ మ్యాచ్‌ను నిర్వ‌హించారు. పెషావర్ జల్మి, ఆల్-స్టార్ లెజెండ్స్ ఎలెవ‌న్ జట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో పెషావ‌ర్ జ‌ల్మికి బాబ‌ర్ ప్రాతినిధ్యం వ‌హించాడు. ఈ మ్యాచ్‌లో బాబ‌ర్ ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టాడు. బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ రెండు వికెట్లు తీశాడు.

T20I Tri Series 2025 : ఆసియాక‌ప్ 2025కి ముందు జోరందుకున్న‌ పాక్‌.. భార‌త్‌కు ఇక క‌ష్ట‌కాల‌మేనా?

స్పిన్ బౌలింగ్‌..

బాబ‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో పెద్ద‌గా బౌలింగ్ చేయ‌లేదు. అయితే.. ఎగ్జిబిష‌న్ మ్యాచ్‌లో మాత్రం త‌న బౌలింగ్ నైపుణ్యాల‌ను ప్ర‌ద‌ర్శించాడు. పాక్ దిగ్గ‌జ ఆట‌గాడు యూనిస్ ఖాన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అంతేకాదండోయ్ మ‌రో మాజీ ఆట‌గాడు అజార్ అలీని పెవిలియ‌న్‌కు చేర్చాడు.

ఇక బ్యాటింగ్‌లో 23 బంతులు ఎదుర్కొన్న బాబ‌ర్ 4 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 41 ప‌రుగులు చేశాడు.

Alex Hales : టీ20 క్రికెట్‌లో అలెక్స్ హేల్స్ అరుదైన ఘ‌న‌త‌.. క్రిస్ గేల్, కీరాన్ పొలార్డ్ ల ఎలైట్ లిస్ట్‌లో చోటు..

కాగా.. బాబ‌ర్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌కు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో పెషావ‌ర్ జ‌ల్మి 6 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

Exit mobile version