NZ vs PAK : ఏమ‌య్యా.. 16 సిక్స్‌లు కొట్టావ్‌.. ఇంకొక్కటి బాదుంటేనా..?

న్యూజిలాండ్ ఓపెన‌ర్ ఫిన్ అలెన్ పెను విధ్వంసం సృష్టించాడు.

Finn Allen

New Zealand vs Pakistan : న్యూజిలాండ్ ఓపెన‌ర్ ఫిన్ అలెన్ పెను విధ్వంసం సృష్టించాడు. పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. మూడో టీ20 మ్యాచులో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. కేవ‌లం 62 బంతుల్లో 5 ఫోర్లు, 16 సిక్స‌ర్లు బాది 137 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ రికార్డును బ‌ద్ద‌లు కొట్టే అవ‌కాన్ని తృటిలో తృటిలో చేజార్చుకున్నా.. దాన్ని స‌మం చేశాడు. ఓ టీ20 మ్యాచ్ ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆట‌గాడిగా అఫ్గానిస్తాన్‌ ప్లేయర్ హజ్రతుల్లా జజాయ్ ఉండ‌గా తాజాగా అత‌డి స‌ర‌స‌న ఫిన్ నిలిచాడు. హజ్రతుల్లా జజాయ్ 2019లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 16 సిక్సర్లు కొట్టాడు.

అంతేకాదండోయ్ న్యూజిలాండ్ త‌రుపున టీ20 మ్యాచులో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాడిగా ఫిన్ అలెన్ చ‌రిత్ర సృష్టించాడు. ఇంత‌క‌ముందు వ‌ర‌కు బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (123) పేరిట ఈ రికార్డు ఉండ‌గా తాజాగా ఫిన్ దాన్ని అధిగ‌మించాడు.

బెంగళూరు టీ20.. పాకిస్థాన్ రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా?

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఫిన్ వీర‌విహారంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 224 ప‌రుగులు చేసింది. ఫిన్ 48 బంతుల్లోనే శ‌త‌కం చేయ‌డం విశేషం. ఫిన్ కాకుండా టీమ్ సీఫ‌ర్ట్ (31), గ్లెన్ ఫిలిప్స్ (19)లు మాత్ర‌మే రాణించ‌గా మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. పాకిస్తాన్ బౌల‌ర్ల‌లో హరీస్‌ రౌఫ్ రెండు వికెట్లు తీశాడు. షాహీన్ అఫ్రిది, మ‌హ్మ‌ద్ న‌వాజ్‌, జమాన్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్ లు తలా ఓ వికెట్‌ ప‌డ‌గొట్టారు.

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 179 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. దీంతో 45 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. ఈ నేప‌థ్యంలో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో మ‌రో రెండు మ్యాచులు మిగిలి ఉండ‌గానే కివీస్ సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది.

Viral video : గ‌ల్లీ క్రికెట్‌లో మోసం.. ఏంటి చిన్నా ఇదీ.. చూడు బ్యాట‌ర్ ఎంత‌గా ఫీల్ అయ్యాడో.. నిజం చెప్పొద్దు

పాక్ బ్యాట‌ర్ల‌లో బాబ‌ర్ ఆజాం (58) వ‌రుస‌గా మూడో మ్యాచుల్లోనూ అర్ధ‌శ‌త‌కం సాధించాడు. మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో పాక్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. కివీస్ బౌల‌ర్ల‌లో సౌథీ రెండు వికెట్లు తీశాడు. హెన్రీ, ఫెర్గూసన్‌, సాంట్నర్‌, సోధి త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

ట్రెండింగ్ వార్తలు