×
Ad

IND vs PAK : 41 ఏళ్ల ఆసియాక‌ప్ చ‌రిత్ర‌లోనే తొలిసారి ఇలా.. ఇప్పుడు ఏం జ‌రుగుతుందో మ‌రీ..

ఆసియాక‌ప్ చ‌రిత్ర‌లో తొలిసారి భార‌త్, పాక్ జ‌ట్లు (IND vs PAK) ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి.

First time in 41 years Asia Cup history India and Pakistan to play final

IND vs PAK : ఆసియాక‌ప్ 2025లో ఫైన‌ల్‌ ఆడే జ‌ట్లు ఏవో తెలిసిపోయాయి. ఆదివారం (సెప్టెంబ‌ర్ 28న‌) జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్ లో భార‌త్‌తో పాకిస్తాన్ ఢీ కొట్ట‌నుంది. కాగా.. 41 ఏళ్ల ఆసియాక‌ప్ చ‌రిత్ర‌లో ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్‌, పాక్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నుండ‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదండోయ్ ఒకే ఎడిష‌న్‌లో మూడు సార్లు భార‌త్‌, పాక్ త‌ల‌ప‌డ‌డం కూడా ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం.

1984లో ఆసియాక‌ప్ ప్రారంభమైంది. తొలి ఎడిష‌న్‌లో మూడు టీమ్‌లు ఆడ‌గా ప్ర‌స్తుతం ఎనిమిది జ‌ట్ల‌కు చేరుకుంది. ఇక భార‌త జ‌ట్టు అత్య‌ధిక సార్లు ఆసియాక‌ప్‌ను కైవ‌సం చేసుకున్న జ‌ట్టుగా నిలిచింది. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ 8 సార్లు ఈ క‌ప్పును ముద్దాడింది. ఆ త‌రువాత శ్రీలంక ఆరు సార్లు విజ‌యం సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఇక పాకిస్తాన్ విష‌యానికి వ‌స్తే.. రెండు సార్లు ఆసియాక‌ప్ విజేత‌గా నిలిచింది.

Team India : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్.. ఇప్పుడెలా?

ఇదిలా ఉంటే.. ఆసియాక‌ప్ చ‌రిత్ర‌లో భార‌త్ 10 సార్లు ఫైన‌ల్ చేరుకోగా ఎనిమిది సార్లు విజ‌యం సాధించింది.

ఎవ‌రు ఎలా ఫైన‌ల్‌కు చేరుకున్నారంటే.?

ఆసియాక‌ప్ 2025లో భార‌త్‌, పాక్‌లు ఎలా ఫైన‌ల్‌కు చేరుకున్నాయో ఓ సారి చూద్దాం..

భార‌త్‌, పాకిస్తాన్‌, యూఏఈ, ఒమ‌న్ దేశాలు గ్రూప్‌-ఏలో ఉండ‌గా శ్రీలంక‌, అప్గానిస్తాన్‌, బంగ్లాదేశ్‌, హాంగ్‌కాంగ్‌లు గ్రూప్‌-బిలో ఉన్నాయి. గ్రూప్‌-ఏలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన భార‌త్‌, పాక్ జ‌ట్లతో పాటు గ్రూప్‌-బిలో టాప్‌-2లో నిలిచిన శ్రీలంక, బంగ్లాదేశ్ జ‌ట్లు సూప‌ర్‌-4కి చేరుకున్నాయి.

Karun Nair : వెస్టిండీస్‌తో సిరీస్‌కు నో ప్లేస్‌.. ఎట్ట‌కేల‌కు మౌనం వీడిన క‌రుణ్ నాయ‌ర్‌.. నన్ను కాదు.. వారినే అడ‌గండి..

సూప‌ర్‌-4 తొలి మ్యాచ్‌లో పాక్ ను చిత్తు చేసిన భార‌త్ రెండో మ్యాచ్‌లో బంగ్లాపై గెలుపొందింది. సూప‌ర్‌-4లో ఆఖ‌రి మ్యాచ్‌ను భార‌త్‌ నేడు శ్రీలంక‌తో ఆడ‌నుంది. ఈ మ్యాచ్ ఫ‌లితంతో సంబంధం లేకుండానే భార‌త్ ఇప్ప‌టికే ఫైన‌ల్ చేరుకుంది. సూప‌ర్‌-4 తొలి మ్యాచ్‌లో భార‌త్ చేతిలో ఓడిపోయిన పాక్.. ఆ త‌రువాత శ్రీలంక‌, బంగ్లాదేశ్ ల‌పై చ‌మ‌టోడ్చి విజ‌యం సాధించి ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది.