Gambhir Blunt Reply After Kohli Public Criticism Of BCCI Family Diktat
ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ఇండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలో బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్లతో కుటుంబాలు గడిపే సమయాన్ని పరిమితం చేసే మార్గదర్శకాలు అందులో ఉన్నాయి.
45 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండే పర్యటనల్లో 14 రోజుల పాటు కుటుంబాలతో ఆటగాళ్లు ఉండొచ్చు అనే నియమం ఉంది. అంతకంటే తక్కువ సమయం ఉన్న టోర్నీల్లో ఆటగాళ్లతో కుటుంబ సభ్యులు ఉండే అవకాశం లేదు. దీనిపై విరాట్ కోహ్లీ వంటి సీనియర్‌తో పాటు పలువురు ఆటగాళ్లు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ENG vs IND : తొలి రోజు ఆటలో అనూహ్య ఘటన.. బుమ్రానే భయపెట్టాయ్‌గా.. షాకింగ్ వీడియో..
కాగా.. బీసీసీఐ పెట్టిన షరతులపై తొలి సారి టీమ్ఇండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఛతేశ్వర్ పుజారాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఆటగాళ్లు అందరూ ఓ విషయాన్ని గుర్తించుకోవాలన్నాడు. హాలీడే కోసం విదేశీ పర్యటనకు వెళ్లడం లేదన్నాడు. ప్రతి ఒక్క ఆటగాడు క్రికెట్ పై దృష్టి పెట్టాలన్నాడు. దేశం గర్వపడేలా చేయాలన్నాడు.
‘కుటుంబాలు కూడా ముఖ్యమైనవే. అదే సమయంలో దేశం కోసం ఆడేందుకు వచ్చినప్పుడు మన దృష్టి ఇక్కడే ఉండాలి. లక్ష్యానికి కట్టుబడి ఉండాలి. ప్రస్తుతం అంతా బాగానే ఉందని అనుకుంటున్నాను. ఇక నా వరకు అయితే ఇతర విషయాల కంటే లక్ష్యమే ఎక్కువ.’ అని గంభీర్ అన్నాడు.
గతంలో విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే..?
విదేశీ పర్యటనల్లో కుటుంబాలు దగ్గరగా లేకపోతే ఆటగాళ్లు మానసిక సమస్యలు ఎదుర్కొంటారని కోహ్లీ అన్నాడు. దీని ప్రభావం జట్టు జయాపజయాలపై పడుతుందని చెప్పాడు. కఠిన సమయాల్లో కుటుంబాలు వెంట ఉంటే ఆటగాళ్లకు ఊరట కలుగుతుందన్నాడు. ఈ విషయం కొంతమందికి తెలియట్లేదని బీసీసీఐపై పరోక్షంగా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లు ముగిశాక ఆటగాళ్లు ఒంటరిగా కూర్చొని బాధపడాలా అని ప్రశ్నించాడు. కుటుంబాలు దగ్గరగా ఉంటే ఆటగాళ్ల ప్రదర్శన మరింత మెరుగుపడుతుందని తెలిపాడు.
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్‌లో కోహ్లి ఈ విషయాలను చెప్పాడు.