×
Ad

Gautam Gambhir : ‘బాబు.. ఇటు రా.. నీతో కాస్త మాట్లాడాలి..’ ప్రాక్టీస్‌ను ఆపి మ‌రి గిల్‌తో సీరియ‌స్‌గా మాట్లాడిన గంభీర్..

ప్రాక్టీస్ సెష‌న్ స‌మ‌యంలో శుభ్‌మ‌న్ గిల్‌తో హెడ్ కోచ్ గౌంభీర్ (Gautam Gambhir) చాలా సేపు మాట్లాడాడు.

Gambhir pulled Gill out for a chat as he was walking with the team for some practice drills

Gautam Gambhir : దాదాపు ఏడాది త‌రువాత టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన శుభ్‌మ‌న్ గిల్ ఈ ఫార్మాట్‌లో పెద్ద‌గా రాణించ‌డం లేదు. ఆసియాక‌ప్ 2025లో పున‌రాగ‌మ‌నం చేసిన గిల్ ఇప్ప‌టి 10 ఇన్నింగ్స్‌లు ఆడాడు 23 స‌గటు, 146 స్ట్రైక్‌రేటుతో కేవ‌లం 184 ప‌రుగులు మాత్ర‌మే సాధించాడు. అత్య‌ధిక స్కోరు 47. దీంతో అత‌డిని త‌ప్పించాల‌నే డిమాండ్లు వ‌స్తున్నాయి.

గురువారం గోల్డ్‌కోస్ట్ లోని కరారా ఓవల్‌ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు నాలుగో టీ20 మ్యాచ్ ఆడ‌నున్నాయి. భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 1.45 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో బుధ‌వారం భార‌త జ‌ట్టు గోల్డ్ కోస్ట్ చేరుకుని ముమ్మ‌రంగా ప్రాక్టీస్ చేసింది. ఈ స‌మ‌యంలో ఓ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

Morne Morkel : అర్ష్‌దీప్ సింగ్‌ను ప‌క్క‌న బెట్ట‌డానికి కార‌ణం ఇదే.. బౌలింగ్ కోచ్ మోర్నీమోర్కెల్ కామెంట్స్ వైర‌ల్‌..


స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌తో క‌లిసి శుభ్‌మ‌న్ గిల్ డ్రిల్‌లో పాల్గొన్నాడు. ఈ స‌మ‌యంలో టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ (Gautam Gambhir ) అత‌డిని ప‌క్క‌కు పిలిచాడు. వీరిద్ద‌రి చాలా సేపు చ‌ర్చించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అత‌డి టీ20 ఫామ్ గురించి చ‌ర్చించుకుని ఉంటార‌ని కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. ఆసీస్‌తో సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో గిల్ వ‌రుస‌గా 37*, 5, 15 ప‌రుగులు సాధించాడు.

సంజూ శాంస‌న్‌కు త‌ప్పించి మ‌రీ..

ప్ర‌స్తుతం వ‌న్డే, టెస్టు కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మ‌న్ గిల్ భ‌విష్య‌త్తులో టీ20 ఫార్మాట్‌లోనూ నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అందుకునే రేసులో అంద‌రి కన్నా ముందు ఉన్నాడు. అయితే.. టీ20 ఫార్మాట్‌లో అత‌డు ప‌రుగులు చేయ‌డంలో ఇబ్బందులు ప‌డుతున్నాడు. య‌శ‌స్వి జైస్వాల్ వంటి ఆట‌గాళ్లు ఓపెనింగ్ ప్లేస్ కోసం ఎదురుచూస్తున్నాడు. అదే స‌మ‌యంలో ఓపెన‌ర్‌గా అద్భుతంగా రాణిస్తున్న సంజూశాంస‌న్ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ను మార్చి మ‌రీ టీమ్ మేనేజ్‌మెంట్ శుభ్‌మన్ గిల్‌ను ఓపెన‌ర్‌గా ఆడిస్తోంది.

IND vs AUS 4th T20 : ఆస్ట్రేలియాతో నాలుగో టీ20 మ్యాచ్‌.. కెరీర్ మైల్ స్టోన్స్‌ పై సంజూ శాంస‌న్‌, తిల‌క్ వ‌ర్మ క‌న్ను..

ఈ నేప‌థ్యంలో నాలుగో టీ20 మ్యాచ్‌లోనైనా అత‌డు ఫామ్ అందుకోవాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్ర‌స్తుతం సిరీస్ 1-1తో స‌మంగా ఉంది. నాలుగో మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు ఆధిక్యంలోకి వెళ్ల‌నుంది. ఈ నేప‌థ్యంలో ఇరు జ‌ట్లు ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించేందుకు హోరాహోరీగా పోరాడుతాయ‌న‌డంలో సందేహం లేదు.