సచిన్‌కు పాయింట్లు కావాలి.. నాకు కప్ కావాలి: గంగూలీ

పుల్వామా ఉగ్రదాడి అనంతరం క్రికెటర్లలోనూ పాక్ దేశంతో ఆడకూడదనే వ్యతిరేకత కనిపించింది. ఈ క్రమంలోనే గంగూలీ, హర్భజన్‌లు ఘాటుగా స్పందిస్తూ.. పది జట్లు ఆడుతున్న ప్రపంచ కప్‌లో పాక్ ఆడకపోతే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు. గంగూలీ అయితే పాక్‌ను అన్ని అంతర్జాతీయ క్రీడా పోటీల నుంచి వెలివేయాలని సూచించాడు. వీరికి విరుద్ధంగా స్పందించిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పాక్‌తో ఆడాలి. చిత్తుగా ఓడించాలంటూ అభిప్రాయపడ్డాడు. అంతేకాక, ఆడకుండానే ఆ దేశానికి 2పాయింట్లు ఇచ్చేయడం తనకిష్టం లేదని వెల్లడించాడు. 

సచిన్ వ్యాఖ్యలపై స్పందించిన గంగూలీ.. సచిన్ టెండూల్కర్ పాక్‌తో మ్యాచ్ ఆఢకపోతే మనం పాయింట్లు కోల్పోతామని అలా అంటున్నాడు. నేను మాత్రం మనకు పాయింట్లు కాదు ప్రపంచ కప్ గెలవడమే ముఖ్యమని భావిస్తున్నా. ఇక నేను రాజకీయాల్లోకి రావాలనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నానని జావేద్ మియాందాద్ చేసిన వ్యాఖ్యలపై స్పందించదలచుకోలేదు’ అని పేర్కొన్నాడు. 

మ్యాచ్ ఆరంభానికి ముందు జరిగే మీడియా సమావేశంలో పాల్గొన్న కోహ్లీ.. బీసీసీఐ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపాడు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ.. ఒకవేళ బీసీసీఐ ఆడమని చెప్తే కోహ్లీ చూస్తూ ఊరుకోడు. 6 నెలలుగా టీమిండియా చక్కటి ఫామ్ లో కనిపిస్తోంది. కచ్చితంగా దాయాది జట్టుకు తగ్గ బుద్ది చెప్తాడు. బీసీసీఐ చెప్పిందే చేసేందుకు క్రికెటర్లంతా సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చాడు.