Angelo Mathews Timed Out : మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌.. గౌత‌మ్ గంభీర్ ఏమ‌న్నాడో తెలుసా..?

Gambhir on Angelo Mathews Timed Out : క్రికెట్‌ను జెంటిల్‌మ‌న్ గేమ్ అని అంటారు. అయితే కొన్ని సార్లు ఈ ఆటలో క్రీడాస్పూర్తి అనే అంశం తెర‌పైకి వ‌స్తుంటుంది.

Gambhir on Angelo Mathews Timed Out

క్రికెట్‌ను జెంటిల్‌మ‌న్ గేమ్ అని అంటారు. అయితే కొన్ని సార్లు ఈ ఆటలో క్రీడాస్పూర్తి అనే అంశం తెర‌పైకి వ‌స్తుంటుంది. ఢిల్లీలో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆట‌గాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ అయిన మొద‌టి అంత‌ర్జాతీయ క్రికెట‌ర్‌గా నిలిచాడు. దీంతో మ‌రోసారి క్రీడాస్పూర్తి అనే అంశం చ‌ర్చ‌కు వ‌చ్చింది. మాథ్యూస్ టైమ్డ్ ఔట్ పై మాజీ క్రికెట‌ర్లు గౌత‌మ్ గంభీర్‌, డేల్ స్టెయిన్ లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఢిల్లీ ఘ‌ట‌న‌ ద‌య‌నీయ‌మైన‌ద‌ని భార‌త మాజీ క్రికెట‌ర్ గంభీర్ ఎక్స్ వేదిక‌గా తెలియ‌జేశాడు.

ఇది ఎంత‌మాత్ర‌మూ సరికాద‌ని ద‌క్షిణాఫ్రికా మాజీ ఆట‌గాడు డేల్ స్టెయిన్ చెప్పాడు.

Angelo Mathews Timed Out: నేనేమీ తప్పు చేయలేదు..! నా దగ్గర ఆధారాలున్నాయ్.. టైమ్డ్ ఔట్ పై మాథ్యూస్ వరుస ట్వీట్లు

వీరిద్ద‌రే కాకుండా ప‌లువురు ప్ర‌స్తుత‌, మాజీ క్రికెటర్లు సైతం ఈ ఘ‌ట‌న‌పై మండిప‌డుతున్నారు. మాథ్యూస్ క్రీజులోనే ఉన్నాడ‌ని, అత‌డి హెల్మెట్ ప‌ట్టీ విరిగిపోవ‌డంతో టైమ్డ్ ఔట్ ఎలా ఇస్తార‌ని ఆస్ట్రేలియా ఓపెన‌ర్ ఉస్మాన్ ఖ‌వాజా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్నించారు.

అస‌లు ఏం జ‌రిగింది..?

బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. స‌మ‌ర విక్ర‌మ ఔట్ కావ‌డంతో ఏంజెలో మాథ్యూస్ క్రీజులోకి వ‌చ్చాడు. అయితే.. అత‌డు బ్యాటింగ్ మొద‌లుపెట్ట‌క‌ముందే అత‌డి హెల్మెట్ స్ట్రాప్ తెగిపోయింది. దీన్ని గుర్తించిన మాథ్యూస్ మ‌రో హెల్మెట్ తెప్పించుకోబోయాడు. నిర్ణీత స‌మ‌యం మించిపోయింద‌ని భావించిన బంగ్లాదేశ్ కెప్టెన్ ష‌కీబ్ నిబంధ‌నల ప్ర‌కారం మాథ్యూస్ అంటూ అంపైర్ల‌కు అప్పీల్ చేశాడు. తాను ఎందుకోసం వేచి చూస్తున్నాన‌నే దాన్ని బంగ్లా కెప్టెన్‌ ష‌కీబ్‌, అంపైర్ల‌కు ఎంత వివ‌రించే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది. అంపైర్లు మాథ్యూస్‌ను టైమ్డ్ ఔట్ అంటూ చెప్ప‌డంతో అత‌డు నిరాశ‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

టైమ్డ్ ఔట్ అంటే ఏమిటీ..?

మ్యాచ్‌లో ఓ విక‌ట్ ప‌డిన‌త‌రువాత త‌రువాత బంతిని ఎదుర్కొనేందుకు బ్యాట‌ర్ రెండు నిమిషాల్లోనే క్రీజులోకి రావాల్సి ఉంటుంది. లేదంటే నిబంధ‌న‌ల ప్ర‌కారం టైమ్డ్ ఔట్‌గా ప్ర‌క‌టిస్తారు. కాగా.. అంత‌ర్జాతీయ క్రికెట్లో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ అయిన మొద‌టి క్రికెట్‌గా నిలిచాడు. దీనిపై ప్ర‌స్తుతం పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది.

Timed OUT : గంగూలీ జ‌స్ట్ మిస్‌.. టైమ్డ్ ఔట్ అయిన మొద‌టి క్రికెట‌ర్ అయ్యేవాడే.. 6 నిమిషాల ఆల‌స్యం.. ఎలా త‌ప్పించుకున్నాడో తెలుసా..?

ట్రెండింగ్ వార్తలు