Gautam Gambhir : బీసీసీఐకి గంభీర్ ష‌ర‌తు.. టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా వ‌చ్చేందుకు..!

గంభీర్ టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా వ‌చ్చేందుకు ఓష‌ర‌తు విధించాట‌.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024తో టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వి కాలం పూర్తి అవుతుంది. ఆయ‌న వార‌సుడిగా ఎవ‌రు వ‌స్తారు అనే చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రిగింది. టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు గౌత‌మ్ గంభీర్ ను హెడ్ కోచ్‌గా బీసీసీఐ నియ‌మించిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. ద్ర‌విడ్ ప‌ద‌వీకాలం పూర్తి కాగానే కోచ్‌గా గంభీర్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడ‌ని, త‌న మార్క్ చూపించేందుకు అత‌డు సిద్ధంగా ఉన్న‌ట్లు దైనిక్ భాస్క‌ర్ త‌న క‌థ‌నంలో పేర్కొంది. గంభీర్ నియామ‌కాన్ని బీసీసీఐ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు పేర్కొంది.

“భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉండటానికి మేము గంభీర్‌తో చర్చలు జరిపాము. అతను టీ20 ప్రపంచ కప్ తర్వాత పదవీ విరమణ చేయ‌నున్న‌ రాహుల్ ద్రవిడ్‌ స్థానాన్ని భర్తీ చేస్తాడు,” అని బీసీసీఐ వ‌ర్గాలు చెప్పినట్లుగా తెలిపింది. కాగా.. గంభీర్ టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా వ‌చ్చేందుకు ఓష‌ర‌తు విధించాట‌. అందుకు బీసీసీఐ ఒప్పుకోవ‌డంతోనే అత‌డు కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డానికి సిద్ధం అవుతున్నాడట‌.

Babar Azam : ఓదార్పు విజ‌యం.. పాక్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం కీల‌క వ్యాఖ్య‌లు.. ఇంటికెళ్లాక‌..

జ‌ట్టు స‌హాయ‌క కోచింగ్ సిబ్బందిని త‌నే నిర్ణ‌యిస్తాన‌ని, అందుకు అనుమ‌తి ఇస్తేనే కోచ్‌గా వ‌స్తాన‌ని చెప్పాడ‌ట‌. ఇందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు నివేదిక జోడించింది. గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించడంపై బోర్డు ఈ నెలాఖరులో అధికారిక ప్రకటన చేయనున్న‌ట్లు చెప్పింది. ప్ర‌స్తుతం బ్యాటింగ్‌కు విక్ర‌మ్ రాథోడ్‌, బౌలింగ్ పార‌స్ మాంబ్రే, ఫీల్డింగ్‌కు దిలీప్ లు స‌హాయ‌క కోచ్‌లుగా ఉన్నారు. వీరినే కొన‌సాగిస్తాడా..? లేదంటే వీళ్ల స్థానాల్లో కొత్త వారిని గంభీర్ తీసుకుంటాడా..? అన్న అంశం ఆస‌క్తిక‌రంగా మారింది.

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో విజేత‌గా నిల‌వ‌డంలో ఆ జ‌ట్టుకు మెంటార్‌గా ఉన్న గౌత‌మ్ గంభీర్ కీల‌క పాత్ర పోషించాడు. అత‌డి సార‌థ్యంలో కేకేఆర్ రెండు సార్లు టైటిల్ విజేగా నిలిచింది. 2007టీ20, 2011 వ‌న్డే ప్ర‌పంచక‌ప్‌ల‌ను భార‌త జ‌ట్టు గెల‌వ‌డంలో గంభీర్ కీల‌క పాత్ర పోషించాడు. ఇక ఇటీవ‌ల జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో గంభీర్ మాట్లాడుతూ.. టీమ్ఇండియాకు కోచ్‌గా ప‌నిచేయ‌డం కంటే పెద్ద గౌర‌వం ఇంకొక‌టి ఉండ‌ద‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే.

Shubman Gill : క్ర‌మశిక్ష‌ణా చ‌ర్య‌లు..? ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్ శ‌ర్మ‌ను అన్‌ఫాలో.. గిల్ స్పంద‌న..

ట్రెండింగ్ వార్తలు