Glenn Maxwell announces his retirement from ODI cricket
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేలకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. టీ20లపై మరింత దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు వెల్లడించాడు. తన నిర్ణయం గురించి ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్ జార్జ్ బెయిలీతో మాట్లాడినట్లు తెలిపాడు.
ఫైనల్ వర్డ్ పాడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని మాక్స్‌వెల్ వెల్లడించారు. ‘జట్టు పరిస్థితులకు ఎలా స్పందిస్తుందో చూసి కొంచెం నిరాశ చెందుతున్నట్లుగా నాకు అనిపించింది. ఈ విషయమై నేను జార్జ్ బెయిలీతో మాట్లాడాను. అతడి ఆలోచనలు ఏంటి అని అడిగాను. మేము 2027 ప్రపంచకప్ గురించి మాట్లాడుకున్నాము. నేను అప్పటి వరకు ఆడబోనని అతడికి చెప్పాను. నా స్థానంలో యువ ఆటగాళ్లకు ఛాన్స్‌లు ఇచ్చి.. ఆ మెగాటోర్నీ వరకు వారు జట్టులో కుదురుకునేలా ప్రణాళికలను సిద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.’ అని బెయిలీతో చెప్పినట్లు మాక్స్‌వెల్ తెలిపారు.
PBKS vs MI : మ్యాచ్ తరువాత శ్రేయస్ అయ్యర్ కోపం చూశారా? సహచర ఆటగాడిపైనే..
36 ఏళ్ల మాక్స్‌వెల్ 149 వన్డేల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించాడు. 33.81 సగటుతో 3990 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు, 33 అర్థశతకాలు ఉన్నాయి.