PBKS vs MI : మ్యాచ్ తరువాత శ్రేయస్ అయ్యర్ కోపం చూశారా? సహచర ఆటగాడిపైనే..
అయ్యర్ మ్యాచ్ అనంతరం తన సహచర ఆటగాడు శశాంక్ సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గెలుపొందింది. పంజాబ్ విజయంలో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. అయితే.. మ్యాచ్ సమయంలో చాలా ప్రశాంతంగా కనిపించిన అయ్యర్.. మ్యాచ్ అనంతరం తన సహచర ఆటగాడు శశాంక్ సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయ్యర్‌కు కోపం ఎందుకంటే..
లక్ష్య ఛేదనలో పంజాబ్ విజయానికి 20 బంతుల్లో 35 పరుగులు అవసరం. 17వ ఓవర్‌లో శశాంక్ (2) మిడ్ ఆన్ దిశగా షాట్ ఆడాడు. రన్ కోసం పరిగెత్తాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా బంతిని అందుకుని డైరెక్ట్ త్రో వేశాడు. వికెట్లకు బంతి నేరుగా తాకింది. దీంతో శశాంక్ రనౌట్ అయ్యాడు.
అయితే.. రిప్లేలో బ్యాటర్ సింగిల్ పూర్తి చేయడానికి నిర్లక్ష్యంగా పరిగెడుతున్నాడని, పాండ్యా బంతిని అందుకున్న తరువాతనే వేగం పెంచాడని తేలింది. కీలకమైన సమయంలో శశాంక్ నిర్లక్ష్యంగా రనౌట్ కావడం పంజాబ్ కెప్టెన్ ఆగ్రహానికి కారణమైంది.
అయితే.. మ్యాచ్ సమయంలో ప్రశాంతంగానే కనిపించిన అయ్యర్.. ఆటగాళ్లు కరచాలనం చేసే సమయంలో శశాంక్‌తో అతడి పేలవ రనౌట్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ కాగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
MI vs PBKS : క్వాలిఫయర్-2 మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ పై నెటిజన్ల విమర్శలు..
After the match is over, Shreyas Iyer is saying something angrily to Shashank Singh, tell me what is he saying?#shreyashiyar |#ShashankSingh #IPLPlayoffs |#PBKSvsMI pic.twitter.com/Eo7s7YHSgn
— Irfan isak shaikh (@irfan_speak786) June 1, 2025