MI vs PBKS : శ్రేయ‌స్ అయ్య‌ర్‌, హార్దిక్ పాండ్యాల‌కు బీసీసీఐ బిగ్ షాక్‌.. ఒక‌రికి రూ.24ల‌క్ష‌లు, మ‌రొక‌రికి రూ.30ల‌క్ష‌ల ఫైన్‌

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌తో పాటు ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ జ‌రిమానా విధించింది.

MI vs PBKS : శ్రేయ‌స్ అయ్య‌ర్‌, హార్దిక్ పాండ్యాల‌కు బీసీసీఐ బిగ్ షాక్‌.. ఒక‌రికి రూ.24ల‌క్ష‌లు, మ‌రొక‌రికి రూ.30ల‌క్ష‌ల ఫైన్‌

Courtesy BCCI

Updated On : June 2, 2025 / 9:49 AM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలోని పంజాబ్ కింగ్స్ అద‌రగొడుతోంది. క్వాలిఫ‌య‌ర్ -2లో ముంబై ఇండియ‌న్స్‌ను ఓడించి ఫైన‌ల్‌కు చేరుకుంది.

ఆదివారం న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-2 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు చేసింది. తిల‌క్ వ‌ర్మ (44), సూర్య‌కుమార్ యాద‌వ్ (44) లు రాణించారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అజ్మతుల్లా రెండు వికెట్లు తీయ‌గా.. జేమీసన్, విజయ్ కుమార్ వైశక్, చాహ‌ల్‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

MI vs PBKS : క్వాలిఫ‌య‌ర్‌-2 మ్యాచ్ సంద‌ర్భంగా బీసీసీఐ పై నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు..

ఆ త‌రువాత శ్రేయ‌స్ అయ్య‌ర్ (87 నాటౌట్‌; 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స‌ర్లు), నేహ‌ల్ వ‌ధేరా (48; 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) దంచికొట్ట‌డంతో భారీ ల‌క్ష్యాన్ని పంజాబ్ 19 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబై బౌల‌ర్ల‌లో అశ్వ‌నీకుమార్ రెండు వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్‌, హార్దిక్ పాండ్యా త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

శ్రేయ‌స్‌, హార్దిక్ పాండ్యాకు జ‌రిమానా..
ఇదిలా ఉంటే.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌తో పాటు ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాల‌కు బీసీసీఐ భారీ జ‌రిమానా విధించింది. ఇరు జ‌ట్లు స్లో ఓవ‌ర్ రేటు నమోదు చేయ‌డమే ఇందుకు కార‌ణం.

ఈ సీజ‌న్‌లో పంజాబ్ జ‌ట్టు స్లో ఓవ‌ర్ రేటు న‌మోదు చేయ‌డం ఇది రెండో సారి కావ‌డంతో.. ఆ జ‌ట్టు కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు రూ.24 జ‌రిమానా విధించారు. అంతేకాదండోయ్‌.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ స‌హా ప్లేయింగ్ ఎలెవ‌న్‌లోని ఆట‌గాళ్లు అంద‌రికి రూ.6ల‌క్ష‌లు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం.. రెండింటిలో ఏదీ త‌క్కువ అయితే అది జ‌రిమానా విధించిన‌ట్లు బీసీసీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

PBKS vs MI : రోహిత్ శ‌ర్మ‌ను ఔట్ చేసిన త‌రువాత మార్క‌స్ స్టోయినిస్ సెల‌బ్రేష‌న్స్ చూశారా? వామ్మో ఎంత దూకుడో?

అటు ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రూ.30 ల‌క్ష‌లు జ‌రిమానా విధించింది. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ స‌హా మిగిలిన ఆట‌గాళ్లకు రూ.12ల‌క్ష‌లు లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం.. రెండింటిలో ఏదీ త‌క్కువ అయితే అది జ‌రిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ సీజ‌న్‌లో ముంబై జ‌ట్టు స్లో ఓవ‌ర్ రేటును న‌మోదు చేయ‌డం ఇది మూడో సారి.