PBKS vs MI : రోహిత్ శర్మను ఔట్ చేసిన తరువాత మార్కస్ స్టోయినిస్ సెలబ్రేషన్స్ చూశారా? వామ్మో ఎంత దూకుడో?
ఆదివారం అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రోహిత్ శర్మ విఫలం అయ్యాడు.

Courtesy BCCI
ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పై 81 పరుగులతో రాణించిన రోహిత్ శర్మ ఆదివారం అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో విఫలం అయ్యాడు.
వర్షం, ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడం వల్ల మ్యాచ్ దాదాపు రెండు గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. రెండు ఓవర్లు ముగిసే సరికి ఓపెనర్ రోహిత్ శర్మ 5 బంతుల్లో నాలుగు పరుగులు మాత్రమే చేశాడు.
Rinku Singh : రింకూ సింగ్‌ను పెళ్లిచేసుకోబోతున్న ప్రియా సరోజ్ ఎవరు ?
మూడో ఓవర్‌లో మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో తొలి బంతిని ఫోర్ గా మలిచాడు. దీంతో హిట్‌మ్యాన్ టాప్ గేర్‌లోకి వస్తున్నాడని అంతా భావించారు. అయితే.. ఆ తరువాతి బంతికే మార్కస్.. రోహిత్ శర్మను ఔట్ చేశాడు. డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్‌లో విజయ్‌కుమార్ వైశాక్ క్యాచ్ అందుకోవడంతో హిట్‌మ్యాన్ పెవిలియన్‌కు చేరుకున్నాడు.
విజయ్ క్యాచ్ అందుకున్న తరువాత స్టోయినిస్ దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తంగా రోహిత్ శర్మ 7 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ సాయంతో 8 పరుగులు మాత్రమే చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. తిలక్ వర్మ (44), సూర్యకుమార్ యాదవ్ (44), బెయిర్ స్టో (38), నమన్ దీర్ (37) లు రాణించారు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా రెండు వికెట్లు తీశాడు. జేమీసన్, విజయ్ కుమార్ వైశక్, చాహల్‌లు తలా ఓ వికెట్ తీశారు.
— crictalk (@crictalk7) June 1, 2025
అనంతరం 204 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (87 నాటౌట్; 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు) దంచికొట్టాడు. నేహల్ వధేరా (48; 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు.
ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 ఫైనల్ కు దూసుకువెళ్లింది. జూన్ 3న జరగనున్న ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది.