Rinku Singh : రింకూ సింగ్‌ను పెళ్లిచేసుకోబోతున్న ప్రియా సరోజ్ ఎవరు ?
టీమ్ఇండియా క్రికెటర్ రింకూ సింగ్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.

Rinku Singh Samajwadi party mp priya saroj engament and marriage date fix
టీమ్ఇండియా క్రికెటర్ రింకూ సింగ్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. తాజాగా వీరి నిశ్చితార్థం, పెళ్లి తేదీలు ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి.
జూన్ 8న వీరి నిశ్చితార్థం లక్నోని ఓ లగ్జరీ హోటల్‌లో జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక నవంబర్ 18న వారణాసిలోని హోటల్ తాజ్‌లో వివాహం జరగనుందని అంటున్నారు.
వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే రింకూ, ప్రియ వివాహానికి సంబంధించిన ఊహాగానాలు వచ్చాయి. అప్పుడు ప్రియ తండ్రి, ఎమ్మెల్యే తుపాని సరోజ్ మాట్లాడుతూ.. రింకూ సింగ్ తండ్రితో వివాహానికి సంబంధించిన చర్చలు జరిపినట్లు తెలిపారు. ఏడాది నుంచే ప్రియ, రింకూలు ఒకరికొకరు తెలుసునని చెప్పారు. వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారని, పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయన్నారు.
ఎవరీ ప్రియా సరోజ్..
ప్రియా సరోజ్ సమాజ్ వాదీ పార్టీ ఎంపీ. 2024లో జౌన్పూర్ జిల్లాలోని మచ్లిషహర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ క్రమంలో అతి పిన్న వయస్కురాలైన ఎంపీగా రికార్డులకు ఎక్కారు. ప్రియా న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్‌స్టిట్యూట్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైంది. నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బి కూడా పూర్తి చేశారు.