Rohit Sharma : ఈ పిల్లాడు మామూలోడు కాదురా అయ్యా.. రోహిత్ శర్మను ఎలా ఔట్ చేయాలని అతడినే అడిగాడు.. హిట్‌మ్యాన్ సమాధానం ఇదే..
ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ చిన్నపిల్లలతో కాసేపు సరదాగా సమయాన్ని గడిపాడు

ఆరోసారి ఐపీఎల్ విజేతగా నిలిచేందుకు ముంబై ఇండియన్స్ రెండు అడుగుల దూరంలో ఉంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు మైదానానికి చేరుకుని తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ చిన్నపిల్లలతో కాసేపు సరదాగా సమయాన్ని గడిపాడు. ఈ సమయంలో ఓ చిన్నారి మాట్లాడుతూ.. మిమ్మల్ని ఎలా ఔట్ చేయాలి ? అని అడిగాడు. ఇందుకు రోహిత్ శర్మ కాస్త ఫన్నీగా సమాధానం ఇచ్చాడు.
PBKS vs MI : పంజాబ్ వర్సెస్ ముంబై క్వాలిఫయర్ 2 మ్యాచ్.. పిచ్ రిపోర్టు, హెడ్ టు హెడ్ రికార్డులు..
“sir apako kaise out karne ka”?
Rohit Sharma 🗣️- “Nahi wo nahi ho skata”😂👌🏼 pic.twitter.com/KLjQJ6w0wh
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 31, 2025
‘లేదు.. అలా జరగదు’ అంటూ హిట్‌మ్యాన్ సమాధానం ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
కీలక సమయంలో రోహిత్ శర్మ ఫామ్ అందుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 50 బంతులు ఎదుర్కొని 162 స్ట్రైక్‌రేటుతో 81 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లు ఉన్నాయి. మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక అయ్యాడు.
ఈ సీజన్‌లో హిట్‌మ్యాన్ 14 ఇన్నింగ్స్‌ల్లో 31.35 సగటు, 150.18 స్ట్రైక్‌రేటుతో 410 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.