PBKS vs MI : క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్ వ‌ర్షం వ‌ల్ల ర‌ద్దైతే.. పంజాబ్‌, ముంబైల‌లో ఫైన‌ల్ చేరుకునేది ఎవ‌రో తెలుసా?

అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోదీ స్టేడియంలో ఆదివారం క్వాలిఫ‌య‌ర్ 2లో భాగంగా ముంబై ఇండియ‌న్స్‌తో పంజాబ్ కింగ్స్ త‌ల‌ప‌డ‌నుంది.

PBKS vs MI : క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్ వ‌ర్షం వ‌ల్ల ర‌ద్దైతే.. పంజాబ్‌, ముంబైల‌లో ఫైన‌ల్ చేరుకునేది ఎవ‌రో తెలుసా?

Courtesy BCCI

Updated On : June 1, 2025 / 10:28 AM IST

అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోదీ స్టేడియంలో ఆదివారం క్వాలిఫ‌య‌ర్ 2లో భాగంగా ముంబై ఇండియ‌న్స్‌తో పంజాబ్ కింగ్స్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన జ‌ట్టు ఐపీఎల్ 2025 ఫైన‌ల్‌కు చేరుకుంటుంది. జూన్ 3న ఇదే స్టేడియంలో జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో క‌ప్పు కోసం పోటీప‌డ‌నుంది.

ఈ క్ర‌మంలో క్వాలిఫ‌య‌ర్ 2లో విజేత‌గా నిలిచి ఫైన‌ల్ చేరుకోవాల‌ని ఇటు పంజాబ్‌, అటు ముంబై ఇండియ‌న్స్ ఆరాట‌ప‌డుతున్నాయి. అయితే.. ఈ కీల‌క మ్యాచ్‌ వ‌ర్షం ప‌డి ర‌ద్దు అయితే ప‌రిస్థితి ఏంటి అనే అనుమానం చాలా మందిలో ఉంది.

IND vs ENG : ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు టీమ్ఇండియా మేనేజ‌ర్ అత‌డే..

వ‌ర్షం ప‌డి క్వాలిఫ‌య‌ర్ 2 ర‌ద్దు అయితే..

క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్‌కు ఎలాంటి రిజ‌ర్వ్ డే లేదు. దీంతో వ‌ర్షం ప‌డి మ్యాచ్ ర‌ద్దు అయితే.. ఐపీఎల్ నిబంధ‌న‌ల ప్ర‌కారం లీగ్ స్టేజీలో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేసిన జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుకుంటుంది. లీగ్ ద‌శ‌లో పాయింట్ల ప‌ట్టిక‌లో పంజాబ్ కింగ్స్ అగ్ర‌స్థానంలో నిలవ‌గా, ముంబై నాలుగో స్థానంలో నిలిచిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో వ‌ర్షం ప‌డి క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్ ర‌ద్దు అయితే.. పంజాబ్ కింగ్స్ ఫైన‌ల్‌కు వెలుతుంది.

PBKS vs MI : ముంబైతో క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్‌కు ముందు పంజాబ్‌కు శుభ‌వార్త‌..

శనివారం స్టేడియం స‌మీపంలో స్వ‌ల్పంగా వ‌ర్షం ప‌డిన‌ప్ప‌టికి.. ఆక్యూ వెద‌ర్ ప్ర‌కారం ఆదివారం మ్యాచ్‌కు ఎలాంటి వ‌ర్షం ముప్పు లేదు. ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంద‌ని అంచ‌నా వేసింది.

అహ్మ‌దాబాద్ స్టేడియంలోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కావ‌డంతో.. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంది.