PBKS vs MI : ముంబైతో క్వాలిఫయర్ 2 మ్యాచ్‌కు ముందు పంజాబ్‌కు శుభవార్త..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న క్వాలిఫయర్ -2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడనుంది.

Courtesy BCCI
ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న క్వాలిఫయర్ -2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు పంజాబ్‌కు శుభవార్త అందింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ముంబైతో మ్యాచ్ ఆడనున్నట్లు సమాచారం.
గాయం కారణంగా క్వాలిఫయర్-1తో పాటు లీగ్ దశలో రెండు మ్యాచ్‌లకు దూరమైన ఈ లెగ్ స్పిన్నర్ చేరిక పంజాబ్ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. ఈ సీజన్‌లో చాహల్ 14 వికెట్లు పడగొట్టాడు.
Mumbai Indians : పంజాబ్‌తో మ్యాచ్.. ముంబై ఫ్యాన్స్‌కు కొత్త టెన్సన్..
ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, జోష్ ఇంగ్లిస్, నేహాల్ వధేరా, స్టాయినిస్, శశాంక్ సింగ్‌లతో పంజాబ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. బౌలింగ్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న అర్ష్‌దీప్ సింగ్‌తోడు జేమీసన్, వైశాఖ్, అజ్మతుల్లా లు రాణిస్తే పంజాబ్‌కు తిరుగుఉండదు.
ఇదిలా ఉంటే.. క్వాలిఫయర్ 2లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టు లీగ్ నుంచి నిష్ర్కమిస్తుంది. ఎలిమినేటర్‌లో అదిరిపోయే ప్రదర్శనతో జోరు మీదున్న ముంబైను క్వాలిఫయర్1లో ఘోర పరాభవంతో ఆత్మ విశ్వాసం దెబ్బతిన్న పంజాబ్ కింగ్స్ ఎంత మేరకు అడ్డుకుంటుందో చూడాల్సిందే.
GT vs MI : హార్దిక్ పాండ్యా హ్యాండ్‌షేక్‌ను శుభ్‌మన్ గిల్ పట్టించుకోలేదా? మండిపడుతున్న అభిమానులు
అయితే.. ఒక్క మ్యాచ్ ఓడిపోయినంత మాత్రన పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు.