GT vs MI : హార్దిక్ పాండ్యా హ్యాండ్‌షేక్‌ను శుభ్‌మన్ గిల్ పట్టించుకోలేదా? మండిప‌డుతున్న అభిమానులు

టాస్ స‌మ‌యంలో ఇరు జ‌ట్ల కెప్టెన్ల మ‌ధ్య‌ చోటుచేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చ‌నీయాంశంగా మారింది.

GT vs MI : హార్దిక్ పాండ్యా హ్యాండ్‌షేక్‌ను శుభ్‌మన్ గిల్ పట్టించుకోలేదా? మండిప‌డుతున్న అభిమానులు

Courtesy BCCI

Updated On : May 31, 2025 / 9:49 AM IST

శుక్ర‌వారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా జ‌రిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ పై ముంబై ఇండియ‌న్స్ విజ‌యం సాధించి క్వాలిఫ‌య‌ర్ 2కి అర్హ‌త సాధించింది. ఆదివారం జ‌రిగే క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్‌లో ముంబై జ‌ట్టు పంజాబ్ తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుకుటుంది.

ఎలిమినేట‌ర్ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 228 ప‌రుగులు సాధించింది. రోహిత్ శ‌ర్మ (50 బంతుల్లో 81 ప‌రుగులు), బెయిర్‌స్టో (22 బంతుల్లో 47 ప‌రుగులు) మెరుపులు మెరిపించారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, సాయి కిశోర్‌లు చెరో రెండు వికెట్లు తీయ‌గా.. సిరాజ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

GT vs MI : అందువ‌ల్లే మేం ఓడిపోయాం.. లేదంట‌నే.. గుజ‌రాత్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ కీల‌క వ్యాఖ్య‌లు..

ఆ త‌రువాత‌ సాయి సుదర్శన్‌ (49 బంతుల్లో 80 ప‌రుగులు), వాషింగ్టన్‌ సుందర్‌ (24 బంతుల్లో 48 ప‌రుగులు) రాణించిన‌ప్ప‌టికి ల‌క్ష్య ఛేద‌న‌లో గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 208 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ముంబై బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు, జ‌స్‌ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్, మిచెల్ సాంట్న‌ర్‌, అశ్వ‌నీకుమార్ త‌లా ఓ వికెట్ తీశారు.

హార్దిక్, గిల్ ల‌ మధ్య కోల్డ్ వార్..

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ స‌మ‌యంలో ఇరు జ‌ట్ల కెప్టెన్ల మ‌ధ్య‌ చోటుచేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చ‌నీయాంశంగా మారింది.

ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచిన స‌మ‌యంలో శుభ్‌మ‌న్ గిల్ అత‌డి వైపు చూడ‌కుండా వెనుదిరిగాడని, ఆ స‌మ‌యంలో హార్దిక్ క‌ర‌చాల‌నం కోసం చేయి అందించినా గిల్ ప‌ట్టించుకోలేద‌ని కొంద‌రు అంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైర‌ల్ చేస్తున్నారు.

GT vs MI : గుజ‌రాత్ పై విజ‌యం.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కామెంట్స్‌.. ఆ ఒక్క‌డి వ‌ల్లే ఇదంతా..


ఇక మ్యాచ్ అనంతరం కూడా ఇరు కెప్టెన్ల మధ్య సాధారణంగా ఉండే స్నేహపూర్వక వాతావరణం కొరవడిందని, ఏదో మొక్కుబడిగా మాట్లాడుకున్నట్లు కనిపించిందని అంటున్నారు. ఏదీ ఏమైన‌ప్ప‌టికి టీమ్ఇండియాకు చెందిన ఇద్ద‌రు కీల‌క ఆట‌గాళ్లు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.