IND vs ENG : ఇంగ్లాండ్ పర్యటనకు టీమ్ఇండియా మేనేజర్ అతడే..
జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.

Yudhvir Singh appointed TeamIndia manager for England Test series
జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ పర్యటన కోసం టీమ్ఇండియా అతి త్వరలోనే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు మేనేజర్‌గా ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడు యుధ్వీర్ సింగ్ ఎంపిక అయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ తెలియజేసింది.
కాగా.. నార్తాంప్టన్‌లో ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగే రెండో వార్మప్ మ్యాచ్‌కు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ గైర్హాజరు అయ్యే అవకాశం ఉందని, కేఎల్ రాహుల్ జట్టులోకి వస్తాడని ఊహాగానాలు ఉన్నప్పటికీ.. అలాంటి పరిణామాలేవీ తనకు తెలియవని యుధ్వీర్ పేర్కొన్నాడు.
PBKS vs MI : ముంబైతో క్వాలిఫయర్ 2 మ్యాచ్‌కు ముందు పంజాబ్‌కు శుభవార్త..
“నాకు ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పూర్తయిన తర్వాత, జట్టులో ఏవైనా మార్పులు ఉంటే మేము నిర్ణయిస్తాము” అని యుధ్వీర్ సింగ్ తెలిపాడు.
ఇంగ్లాండ్ పర్యటనకు ఇప్పటికే భారత జట్టును సెలక్టర్లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. శుభ్‌మన్ నాయకత్వంలో భారత్ ఆడనుంది. వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్‌లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలో గిల్ సారథ్యంలోని యువ భారత్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్‌కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..
తొలి టెస్టు – 2025 జూన్ 20 నుంచి 24 వరకు – హెడ్లింగ్లీ, లీడ్స్
రెండో టెస్టు – 2025 జూలై 2 నుంచి 6 వరకు – ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
మూడో టెస్టు – 2025 జూలై 10 నుంచి 14 వరకు – లార్డ్స్, లండన్
నాలుగో టెస్టు – 2025 జూలై 23 నుంచి 27 వరకు – ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
ఐదో టెస్టు – 2025 జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు – ది ఓవల్, లండన్.