PBKS vs RCB : ఆర్‌సీబీపై ఓటమి.. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్ వైరల్.. ‘యుద్ధం ఓడిపోలేదు.. పోరు మాత్రమే..’
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఫైనల్‌కు చేరుకోవాలనుకున్న పంజాబ్ కింగ్స్‌కు భంగపాటు ఎదురైంది. గు

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఫైనల్‌కు చేరుకోవాలనుకున్న పంజాబ్ కింగ్స్‌కు భంగపాటు ఎదురైంది. గురువారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-1లో ఆర్‌సీబీ చేతిలో పంజాబ్ ఓడిపోయింది. ఈ గెలుపుతో ఆర్‌సీబీ ఐపీఎల్ 2025 ఫైనల్‌కు చేరుకుంది. ఓడిపోయినప్పటికి ఫైనల్‌కు చేరుకునేందుకు పంజాబ్‌కు మరో అవకాశం ఉంది. క్వాలిఫయర్-2లో ఎలిమినేటర్ విజేతతో తలపడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే పంజాబ్ ఫైనల్‌కు చేరుకుంటుంది.
ఇక తొలి క్వాలిఫయర్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌలైంది. మార్కస్ స్టోయినిస్ (26) టాప్ స్కోరర్. ఆర్‌సీబీ బౌలర్లలో సుయాశ్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్‌లు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. యశ్ దయాళ్ రెండు వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపర్డ్ లు తలా ఓ వికెట్ సాధించారు. ఆతరువాత ఫిల్ సాల్ట్ (56; 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టడంతో లక్ష్యాన్ని ఆర్‌సీబీ 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంజాబ్ బౌలర్లలో ముషీర్ ఖాన్, కైల్ జేమిసన్ లు చెరో వికెట్ తీశారు.
ఇక మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందన్నాడు. పిచ్ కండిషన్స్ కు తగినట్లు బ్యాటింగ్ చేయడంలో తమ బ్యాటర్లు ఘోరంగా విఫలం అయ్యారని చెప్పాడు. బౌలర్లను నిందించడానికి ఏమీ లేదని, స్వల్ప లక్ష్యమే ఉండడంతో వారు కూడా ఏమీ చేయలేకపోయారన్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో తమ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయలేకపోయామన్నాడు.
‘ఇది మర్చిపోలేని రోజు. కానీ.. మేం మళ్లీ ఫస్ట్ నుంచి మా ప్రణాళికలను రచించుకోవాలి. బ్యాటింగ్ చేసేటప్పుడు మేం వరుసగా వికెట్లు కోల్పోయాం. చాలా విషయాలను మేం అధ్యయనం చేయాలి. ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో ఎలాంటి తప్పిదం చేయలేదు. నిజం చెప్పాలంటే నా నిర్ణయాలపై నాకు ఎలాంటి సందేహం లేదు. ప్రణాళిక పరంగా మేము ఏది చేసినా (మైదానం బయట ఏ వ్యూహాలు రచించినా) అవి సరైనవే అని నేను భావిస్తున్నాను. అయితే.. మా వ్యూహాలను మేం మైదానంలో సరిగ్గా అమలు చేయలేకపోయాం.’ అని అయ్యర్ అన్నాడు.
ఇలాంటి పిచ్ పై ఆడేటప్పుడు తాము బ్యాటింగ్ పై మరింత ఫోకస్ పెట్టాల్సి ఉందన్నాడు. ఇక్కడ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో వేరియబుల్ బౌన్స్ కనిపించింది. ఇది ఓటమికి సాకుగా చెప్పాలని అనుకోవడం లేదన్నాడు. తాము ప్రొఫెషనల్ ఆటగాళ్లమని, పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేయాలన్నాడు. మేము మ్యాచ్‌లోనే ఓడిపోయామని, యుద్ధంలో ఓడిపోలేదన్నాడు.
జూన్ 1 క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.