MI vs PBKS : క్వాలిఫ‌య‌ర్‌-2 మ్యాచ్ సంద‌ర్భంగా బీసీసీఐ పై నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు..

క్వాలిఫ‌య‌ర్-2 మ్యాచ్ సంద‌ర్భంగా నెటిజ‌న్లు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పై మండిప‌డ్డారు.

MI vs PBKS : క్వాలిఫ‌య‌ర్‌-2 మ్యాచ్ సంద‌ర్భంగా బీసీసీఐ పై నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు..

Courtesy BCCI

Updated On : June 2, 2025 / 9:27 AM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో భాగంగా ఆదివారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోదీ స్టేడియంలో క్వాలిఫ‌య‌ర్‌-2 మ్యాచ్ జ‌రిగింది. ముంబై ఇండియ‌న్స్‌, పంజాబ్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిచి ఫైన‌ల్ మ్యాచ్‌కు అర్హ‌త సాధించింది. దీంతో జూన్ 3న జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జ‌ట్టు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో క‌ప్పు కోసం పోటీప‌డ‌నుంది.

ఇదిలా ఉంటే.. క్వాలిఫ‌య‌ర్-2 మ్యాచ్ సంద‌ర్భంగా నెటిజ‌న్లు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పై మండిప‌డ్డారు. ఇందుకు కార‌ణం లేక‌పోలేదు. క్వాలిఫ‌య‌ర్‌-2 మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా దాదాపు రెండు గంట‌ల స‌మ‌యం క‌న్నా ఆల‌స్యంగా ప్రారంభం కావ‌డ‌మే.

PBKS vs MI : రోహిత్ శ‌ర్మ‌ను ఔట్ చేసిన త‌రువాత మార్క‌స్ స్టోయినిస్ సెల‌బ్రేష‌న్స్ చూశారా? వామ్మో ఎంత దూకుడో?

భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా ఐపీఎల్ ఓ వారం రోజుల పాటు నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత ప్లేఆఫ్స్ కోసం కొత్త వేదిక‌ల‌ను ప్ర‌క‌టించింది. వాస్త‌వానికి ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం క్వాలిఫ‌య‌ర్‌-2 మ్యాచ్‌తో పాటు ఫైన‌ల్ మ్యాచ్ కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌ర‌గాల్సి ఉంది.

అయితే.. వాయిదా అనంత‌రం బీసీసీఐ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు, ఇత‌ర పారామితుల‌ను దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ ప్లేఆఫ్స్ ల కోసం కొత్త వేదిక‌ల‌ను నిర్ణ‌యించింది అని బీసీసీఐ ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Rohit Sharma : ఈ పిల్లాడు మామూలోడు కాదురా అయ్యా.. రోహిత్ శ‌ర్మను ఎలా ఔట్ చేయాల‌ని అత‌డినే అడిగాడు.. హిట్‌మ్యాన్ స‌మాధానం ఇదే..

కానీ.. క్వాలిఫ‌య‌ర్‌-2 వ‌ర్షం వ‌ల్ల ఆల‌స్యం కావ‌డంతో బీసీసీఐ పై నెటిజ‌న్లు మండిప‌డ్డారు.