ODI World Cup 2023 : లైటింగ్ షో.. అభిమానులకు అనుభూతి.. క్రికెటర్లకు భయానక అనుభవం

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో హ్యాట్రిక్ విజ‌యాల‌తో ఆస్ట్రేలియా సెమీస్ రేసులోకి దూసుకు వ‌చ్చింది. బుధ‌వారం ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో నెద‌ర్లాండ్స్‌ను 309 ప‌రుగుల తేడాతో చిత్తు చేసింది.

Maxwell comments on Light Show

ODI World Cup : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో హ్యాట్రిక్ విజ‌యాల‌తో ఆస్ట్రేలియా సెమీస్ రేసులోకి దూసుకు వ‌చ్చింది. బుధ‌వారం ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో నెద‌ర్లాండ్స్‌ను 309 ప‌రుగుల తేడాతో చిత్తు చేసింది. త‌ద్వారా త‌న నెట్ ర‌న్‌రేట్‌ను భారీగా పెంచుకుంది. ఈ మ్యాచ్‌లో 40 బంతుల్లోనే శ‌త‌కం బాది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లోనే ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా మాక్స్‌వెల్ రికార్డుల‌కు ఎక్కాడు. దీంతో అత‌డు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

మ్యాచ్ త‌రువాత మాక్స్‌వెల్ మాట్లాడుతూ.. లైటింగ్ షో విష‌యంలో అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు. దీని వ‌ల్ల త‌ల‌నొప్పి వ‌స్తోంద‌న్నాడు. బిగ్‌బాష్ లీగ్ సంద‌ర్భంగా పెర్త్ మైదానంలో ఇలాంటి లైటింగ్ షోను ఏర్పాటు చేశారు. మ‌ళ్లీ ఇప్పుడు ఢిల్లీలో లైటింగ్ షోను చూసిన‌ట్లు చెప్పాడు. ఈ లైటింగ్ షో వ‌ల్ల త‌ల‌నొప్పి వ‌స్తోందన్నాడు. లైటింగ్ ఆగిపోయిన త‌రువాత క‌ళ్లు అడ్జ‌స్ట్ అయ్యేందుకు దాదాపు రెండు నిమిషాల‌కు పైగా స‌మ‌యం ప‌డుతోంద‌న్నాడు.

Sunil Gavaskar: కోహ్లి 50వ సెంచరీ చేసేది అప్పుడే.. డేట్ ఫిక్స్ చేసిన గావస్కర్!

అభిమానుల‌కు ఈ లైటింగ్ షో అంద‌మైన అనుభూతిని క‌లిగించ‌వ‌చ్చున‌ని, అయితే.. క్రికెట‌ర్ల‌కు మాత్రం భ‌యాన‌క అనుభ‌వ‌మే అవుతోంద‌ని చెప్పాడు. అందుక‌నే లైటింగ్ షో స‌మ‌యంలో క‌ళ్లు మూసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పాడు. లైటింగ్ విష‌యంలో తాను ఒక్క‌డినే ఇబ్బంది ప‌డ‌డం లేద‌ని, దాదాపు క్రికెట‌ర్లు అంద‌రూ ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు మాక్స్‌వెల్ చెప్పాడు.

నెద‌ర్లాండ్స్ ఇన్నింగ్స్ మ‌ధ్య‌లో..

ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 399 ప‌రుగులు చేసింది. గ్లెన్ మాక్స్‌వెల్ (106), డేవిడ్ వార్న‌ర్ (104) సెంచ‌రీలు బాద‌గా.. స్టీవ్ స్మిత్ (71), ల‌బుషేన్ (62) లు అర్థ‌శ‌త‌కాల‌తో రాణించారు. నెద‌ర్లాండ్స్ బౌల‌ర్ల‌లో లోగాన్ వాన్ బీక్ నాలుగు వికెట్లు, బాస్ డి లీడే రెండు, ఆర్యన్ దత్ ఓ వికెట్ ప‌డ‌గొట్టారు. అనంత‌రం 400 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన నెద‌ర్లాండ్స్ 21 ఓవ‌ర్ల‌లో 90 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో ఆడ‌మ్ జంపా నాలుగు వికెట్లు, మిచెల్ మార్ష్ రెండు, మిచెల్ స్టార్క్‌, జోస్ హేజిల్ వుడ్‌, పాట్ క‌మిన్స్ లు త‌లా ఓ వికెట్ తీశారు.

ODI World Cup 2023: ఇంగ్లాండ్ – భారత్ మ్యాచ్.. ఆ ఇద్దరు ప్లేయర్స్ లేకుండానే బరిలోకి టీమిండియా?

నెద‌ర్లాండ్స్ ల‌క్ష్య ఛేద‌న‌లో డ్రింక్స్ బ్రేక్ స‌మ‌యంలో అరుణ్ జైట్లీ స్టేడియంలో పెద్ద డీజే సౌండ్‌తో పాటు లైటింగ్ షోను ఏర్పాటు చేశారు. దాదాపు రెండు నిమిషాల పాటు ఈ లైటింగ్ షో అభిమానుల‌ను అల‌రించింది. అయితే.. ఈ స‌మ‌యంలో క్రికెట‌ర్లు క‌ళ్లు మూసుకోవ‌డం క‌నిపించింది. మాక్స్‌వెల్ సైతం త‌న రెండు చేతుల‌తో రెండు క‌ళ్లు మూసుకున్నాడు. లైటింగ్ వ‌ల్ల ఇబ్బందులు ఏర్ప‌డుతున్నాయని అతడు అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు