Glenn Maxwell : మాక్స్‌వెల్ డ‌బుల్ సెంచ‌రీ పై మీమ్స్‌.. వైర‌ల్

Glenn Maxwell double century : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా మంగ‌ళ‌వారం ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ మాక్స్‌వెల్ రెచ్చిపోయాడు.

Maxwell memes

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా మంగ‌ళ‌వారం ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ మాక్స్‌వెల్ రెచ్చిపోయాడు. అఫ్గానిస్థాన్ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు. 91 ప‌రుగుల‌కే ఏడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన త‌న జ‌ట్టుకు డ‌బుల్ సెంచ‌రీతో విజ‌యాన్ని అందించాడు. ఈ మ్యాచులో 128 బంతులు ఎదుర్కొన్న మాక్స్‌వెల్ 21 ఫోర్లు, 10 సిక్స‌ర్ల‌తో 201 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్ర‌మంలో ఆస్ట్రేలియా త‌రుపున వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో డ‌బుల్ సెంచ‌రీ చేసిన మొద‌టి ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. అఫ్గాన్ పై విజ‌యంతో ఆసీస్ సెమీ ఫైన‌ల్ బెర్తును ఖ‌రారు చేసుకుంది.

Pat Cummins : 11.2 ఓవ‌ర్లు.. 12 ప‌రుగులు.. టెస్టు మ్యాచ్ కాదు మామ‌.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఇదీ..!

ఈ మ్యాచ్‌లో వ్య‌క్తిగ‌త స్కోరు 150 ప‌రుగుల వ‌ర‌కు మాక్స్‌వెల్ చాలా సాధార‌ణంగానే బ్యాటింగ్ చేశాడు. ఆ త‌రువాత అత‌డి కండ‌రాలు ప‌ట్టేశాయి. దీంతో అత‌డు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డాడు. పరిగెత్త‌డం సంగ‌తి అటుంచితే క‌నీసం క్రీజులో నిల‌బ‌డ‌డానికి కూడా క‌ష్ట‌ప‌డ్డాడు. సింగిల్స్ తీయ‌డం ఆపేసీ కేవ‌లం బౌండ‌రీల‌తోనే స్కోరును ప‌రుగులు పెట్టించాడు. కాగా.. మాక్స్‌వెల్ ఇన్నింగ్స్ పై ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. నెటీజ‌న్లు మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు. అత‌డిని ది అండ‌ర్‌టేక‌ర్‌, గాయ‌ప‌డిన సింహంతో పోల్చారు. ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఓ సారి మీమ్స్ పై లుక్కేయండి.

Glenn Maxwell : మాక్స్‌వెల్ కు బై-ర‌న్న‌ర్‌ను ఎందుకు అనుమతించ‌లేదు..? అలాగే ఎందుకు బ్యాటింగ్ చేయాల్సి వ‌చ్చింది..?

ట్రెండింగ్ వార్తలు