Archery World Cup: ఆర్చరీ వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ గోల్డ్ సాధించిన దీపికా కుమారి

స్టార్ ఆర్చర్ దీపికా కుమారి మెగా ఈవెంట్ లో మరోసారి గోల్డ్ సాధించింది. వరల్డ్ కప్ లో ఇండియాకు ప్రాతినిథ్యం వహించి మూడో సారి గోల్డ్ మెడల్ దక్కించుకుంది.

Deepika Kumari

Archery World Cup: స్టార్ ఆర్చర్ దీపికా కుమారి మెగా ఈవెంట్ లో మరోసారి గోల్డ్ సాధించింది. వరల్డ్ కప్ లో ఇండియాకు ప్రాతినిథ్యం వహించి మూడో సారి గోల్డ్ మెడల్ దక్కించుకుంది. మరో నెలలో టోక్యో ఒలింపిక్స్ ఉందనగా ఇటువంటి ఫీట్ సాధించడం విశేషం.

వరల్డ్ నెంబర్ వన్ స్థానంలో ఉన్న కొరియాతో పోటి పడిన ఇండియాకు కాస్త ఛాలెంజింగ్ గానే అనిపించింది. కాకపోతే మిక్స్‌డ్ పెయిర్ ఈవెంట్లో దీపికా ఒకొక్కరితో ధీటుగా రాణించింది. ఐదు గంటలలోపే బ్యాక్ టూ బ్యాక్ నాలుగు మ్యాచ్ లు ఆడి ప్రత్యర్థులకు చెమటలు పుట్టించింది.

ఈ టోర్నీ విజయంతో ఒలింపిక్ కు అర్హత సాధించింది. శనివారం వరకూ జరిగిన గేమ్స్ తో ఇండియా నాలుగు మెడల్స్ తో టాప్ లో కొనసాగుతుంది.