ENG vs IND : ఆ ఇద్దరి ఆటగాళ్ల తొలగింపుపై ఆసీస్ దిగ్గజం షాకింగ్ కామెంట్స్!

ENG vs IND : టీమిండియా జట్టులో ఆ ఇద్దరు ఆటగాళ్లు రాణించడం లేదు. ఫామ్ లేమితో ఉన్నప్పటికీ కూడా వారిద్దరిని జట్టులోనే కొనసాగిస్తోంది టీమిండియా

Great That Indian Selectors Have Dropped Ajinkya Rahane, Ishant Sharma, Brad Hogg (2)

ENG vs IND : టీమిండియా జట్టులో ఆ ఇద్దరు ఆటగాళ్లు రాణించడం లేదు. ఫామ్ లేమితో ఉన్నప్పటికీ కూడా వారిద్దరిని జట్టులోనే కొనసాగిస్తోంది టీమిండియా. అయితే వారిద్దరి తొలగింపుపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. జట్టులోని అజింక్యా రహానె, ఇషాంత్ శర్మలను భారత సెలెక్టర్లు ఈసారి ఎంపిక చేయకపోవడం సరైన నిర్ణయమేనని హాగ్ వ్యాఖ్యానించాడు. రహానె తన బ్యాట్ కు పనిచెప్పి చాలాకాలం అవుతుంది. ఇక ఇషాంత్ తన బంతులకు పదునుపెట్టడంలో విఫలమవుతున్నాడు. వీరిద్దరూ ఆటలో రాణించకపోయినా జట్టులో మాత్రం ప్రతిసారి చోటు దక్కుతూనే ఉంది. ఇప్పుడు మాత్రం భారత సెలక్టర్లు రహానె, ఇషాంత్‌ను పక్కనపెట్టేశారు.

జట్టులో మార్పులపై హాగ్ స్పందిస్తూ.. ఒకేసారి జట్టును మార్చడం కన్నా క్రమంగా జట్టులోకి కొత్తవారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశాన్ని వ్యక్తపరిచాడు. రహానే, ఇషాంత్‌ను తొలగించడం ద్వారా కొత్త ఆటగాళ్లకు ఛాన్స్ తప్పక దొరుకుతుందని చెప్పుకొచ్చాడు. కుర్రాళ్లకు సీనియర్ ఆటగాళ్లతో ఆడే అవకాశం రావాలన్నాడు.

అలా వస్తేనే వారి ఆటతీరులో మెళకువలను నేర్చుకోవడం సాధ్యపడుతుందని హాగ్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే టెస్టు జట్టును ఎంపిక చేయగా.. అందులో ఫామ్‌లో లేని కారణంగా అజింక్యా రహానే, ఇషాంత్ శర్మలను ఎంపిక చేయలేదు. జూలై 1 నుండి ఇంగ్లండ్‌తో భారత్ ఒక టెస్టు ఆడనుంది. శ్రేయాస్ అయ్యర్, ప్రసిద్ధ్ కృష్ణ సహా కొంతమంది కొత్త ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకున్నారు.

Read Also : ENG vs IND: ఇండియాతో మ్యాచ్‌లో రక్తం కారుతున్నా బౌలింగ్ చేసిన జేమ్స్ అండర్సన్