IPL 2024 : హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టును వీడడంపై ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు

హార్ధిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టును వీడి ముంబై ఇండియన్స్ జట్టులో చేరడం అనేది..

Hardik pandya

Hardik pandya : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 టోర్నీ ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్  , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగబోతోంది. ఈసారి ఐపీఎల్ జట్టులో ప్రధాన ఆకర్షణగా హార్ధిక్ పాండ్యా నిలబోతున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు సారథిగా బరిలోకి దిగనున్న పాండ్యా.. జట్టును ఏమేరకు విజయతీరాలకు చేర్చుతాడు? రోహిత్ శర్మ తరహాలో ముంబై జట్టును విజేతగా నిలుపుతాడా అనే అంశాలపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై ముంబై జట్టు ఫ్యాన్స్, రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఈ క్రమంలో జట్టును ముందుకు నడిపించడంలో హార్ధిక్ పాండ్యా ఏమాత్రం విఫలమైన అతని క్రికెట్ కెరీర్ పైనే ప్రభావం పడే అవకాశం ఉందని మాజీలు పేర్కొంటున్నారు. అయితే, తాజాగా హార్ధిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టును వీడడంపై ఆ జట్టు ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.

Also Read : హార్ధిక్, బుమ్రాలు ముంబై జట్టులో కొనసాగడానికి రోహిత్ శర్మనే కారణం.. పార్థివ్ పటేల్ కీలక వ్యాఖ్యలు

హార్ధిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టును వీడి ముంబై ఇండియన్స్ జట్టులో చేరడం అనేది ఆయన ఇష్టం. అతన్ని నేనే ఆపేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. క్రీడల్లో ఏం జరిగినా ముందుకు సాగిపోవాలి. హార్ధిక్ పాండ్య తరహాలో అనుభవజ్ఞుడు దొరకడం కష్టం. ఈసారి మహమ్మద్ షమీ కూడా మాకు అందుబాటులో లేడు. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతోనే ఐపీఎల్ -2024కు సన్నద్ధమవుతున్నాం. ఐపీఎల్ లో తొలుత హార్ధిక్ ముంబై జట్టుకే ఆడాడు. మళ్లీ తిరిగి ఆ జట్టుకే కెప్టెన్ గా వెళ్తున్నాడు. ముంబై కాకుండా వేరే జట్టుకు వెళ్తే ఆపేవాడ్ని ఏమో అంటూ ఆశిష్ నెహ్రా అన్నాడు.

Also Read : WPL 2024 : ఫైనల్స్ కు దూసుకెళ్లిన ఆర్సీబీ జట్టు.. ఆటగాళ్ల సంబరాలు చూశారా.. వీడియో వైరల్

హార్ధిక్ గుజరాత్ టైటాన్స్ జట్టును వీడిని తరువాత శుభ్ మన్ గిల్ ను సారథిగా తీర్చిదిద్దడానికి మంచి అవకాశం దక్కిందని నెహ్రూ అభిప్రాయ పడ్డారు. గిల్ సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్ -2024 టోర్నీలో మంచి ప్రదర్శన ఇస్తుందని ఆశిస్తున్నాను. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా తన తొలి ఐపీఎల్ సీజన్‌ను అనుకరించాలని శుభమాన్ గిల్ లక్ష్యంగా పెట్టుకున్నాడు అంటూ నెహ్రా పేర్కొన్నాడు.

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు