IND vs WI : బ్యాటింగ్‌కు వెళ్లిన‌ చాహ‌ల్‌ను వెన‌క్కి పిలిచిన పాండ్య.. రూల్స్ ఒప్పుకోవ‌న్న అంపైర్లు.. ఆ మాత్రం తెలియ‌దా..!

వెస్టిండీస్‌తో జ‌రిగిన తొలి టీ20లో భార‌త జ‌ట్టు నాలుగు ప‌రుగుల తేడాతో ఓట‌మిని చ‌విచూసింది. ఫ‌లితంగా ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో 0-1 తేడాతో వెన‌క‌బ‌డి ఉంది.

Yuzvendra Chahal

India vs West indies : వెస్టిండీస్‌తో జ‌రిగిన తొలి టీ20లో భార‌త జ‌ట్టు నాలుగు ప‌రుగుల తేడాతో ఓట‌మిని చ‌విచూసింది. ఫ‌లితంగా ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో 0-1 తేడాతో వెన‌క‌బ‌డి ఉంది. బ్రియాన్ లారా స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచులో భార‌త ఇన్నింగ్స్ సంద‌ర్భంగా ఓ ఫ‌న్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. భార‌త విజ‌యానికి ఆఖ‌రి ఓవ‌ర్‌లో 10 ప‌రుగులు అవ‌స‌రం. షెపర్డ్ బౌలింగ్‌లో తొలి బంతికి కుల్దీప్ యాద‌వ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో విజ‌య స‌మీక‌ర‌ణం 5 బంతుల్లో 10 ప‌రుగులుగా మారింది.

ఇక్క‌డే ఓ ఘ‌ట‌న చోటు చేసుకుంది. సాధార‌ణంగా 10వ నెంబ‌ర్‌లో చాహ‌ల్ బ్యాటింగ్‌కు వ‌స్తుంటాడు. ప్ర‌తీసారిలాగే ఈ సారి కూడా అత‌డు క్రీజులోకి వ‌చ్చేశాడు. అయితే.. టీమ్‌మేనేజ్‌మెంట్ మాత్రం ముకేష్‌కుమార్‌ను ఈ స్థానంలో పంపాల‌ని బావించింది. ఈ విష‌యాన్ని చాహ‌ల్‌కు చెప్ప‌లేదు. వెంట‌నే కోచ్ రాహుల్ ద్ర‌విడ్‌, కెప్టెన్ హార్ధిక్ పాండ్య‌లు డ్రెస్సింగ్ రూమ్ నుంచి బ‌య‌ట‌కు వచ్చి స్ట్రైకింగ్ తీసుకునేందుకు సిద్దమైన చాహ‌ల్‌ను వెన‌క్కి వ‌చ్చేయాల‌ని సూచించారు.

Ind Vs WI : భారత్‌కు బిగ్ షాక్.. ఉత్కంఠభరిత పోరులో పరాజయం

చాహ‌ల్ కూడా వెనక్కి వ‌చ్చేందుకు సిద్దం అయ్యాడు. అయితే.. అప్ప‌టికే చాలా ఆల‌స్య‌మైంది. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఓ బ్యాట‌ర్ క్రీజులో వ‌చ్చిన త‌రువాత తిరిగి వెన‌క్కి వెళ్ల‌డానికి నిబంధ‌న‌లు అనుమ‌తించ‌వు. ఇదే విష‌యాన్ని అంపైర్లు చెప్ప‌డంలో దాదాపుగా బౌండ‌రీ వ‌ద్ద‌కు వ‌చ్చిన చాహ‌ల్ తిరిగి బ్యాటింగ్ చేసేందుకు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. రూల్స్‌పై అవ‌గాహాన లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 149 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో భార‌త్ 9 వికెట్ల న‌ష్టానికి 145 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. తిల‌క్ వ‌ర్మ‌(39), సూర్య‌కుమార్ యాద‌వ్‌(21)లు ఫ‌ర్వాలేద‌నిపించ‌గా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో 4 ప‌రుగుల తేడాతో భార‌త్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు.

Tilak Varma: అరంగేట్రంలోనే అదరగొట్టేశాడు.. తిలక్ వర్మ సూపర్ బ్యాటింగ్.. సూపర్ క్యాచ్.. వీడియోలు వైరల్

ట్రెండింగ్ వార్తలు