Tilak Varma: అరంగేట్రంలోనే అదరగొట్టేశాడు.. తిలక్ వర్మ సూపర్ బ్యాటింగ్.. సూపర్ క్యాచ్.. వీడియోలు వైరల్

హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ తన అరంగేట్రం మ్యాచ్‌లో సూపర్ బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో అదరగొట్టేశాడు.

Tilak Varma: అరంగేట్రంలోనే అదరగొట్టేశాడు.. తిలక్ వర్మ సూపర్ బ్యాటింగ్.. సూపర్ క్యాచ్.. వీడియోలు వైరల్

Tilak Varma

IND vs WI T20 match 2023: ఇండియా వర్సెస్ వెస్టిండీస్ (India vs West indies) జట్ల మధ్య గురువారం రాత్రి  ట్రినిడాడ్ (Trinidad) వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ (India) జట్టుకు వెస్టిండీస్ (west indies) జట్టు షాకిచ్చింది. బౌలర్లు రాణించినా.. బ్యాటింగ్‌లో విఫలం కావడంతో స్వల్ప పరుగుల (నాలుగు పరుగుల) తేడాతో విండీస్ జట్టుపై భారత్ జట్టు పరాజయంపాలైంది. దీంతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 1-0 ఆధిక్యంలో విండీస్ జట్టు దూసుకెళ్లింది. అయితే, తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు ఓడిపోయినప్పటికీ.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (Tilak Varma) అరంగేట్రం మ్యాచ్‌లోనే అద్భుత ప్రతిభ కనబర్చాడు. ఫీల్డింగ్ సమయంలో బౌండరీలైన్ వద్ద అద్భుత క్యాచ్ అందుకున్న వర్మ.. బ్యాటింగ్‌లో సిక్సర్ల మోతమోగించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

గత కొంతకాలంగా అటు ఐపీఎల్‌లో, ఇటు దేశవాళీ టోర్నీల్లో నిలకడైన ప్రదర్శనతో అదరగొట్టిన హైదరాబాద్ యువ సంచలనం.. టీమిండియా తరపున గురువారం తొలి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో తన సత్తాను చాటాడు. గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య లాంటి హిట్టర్లు విఫలమైన వేళ.. తాను ఎదుర్కొన్న రెండో బంతినే తిలక్ వర్మ సిక్స్‌గా మలిచి అంతర్జాతీయ కెరీర్‌లో పరుగుల ఖాతా తెరిచాడు. ఆ తరువాతి బంతినిసైతం నేరుగా బౌండరీ అవతల పడేశాడు. మూడు సిక్సులు, రెండు ఫోర్లు బాది 22 బంతుల్లో 39 పరుగులు చేశాడు. మంచి ఊపుమీద కనిపించిన వర్మ.. కొద్దిలో అర్ధశతకాన్ని చేజార్చుకున్నాడు. వర్మ సిక్సులు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

మరోవైపు ఫీల్డింగ్ సమయంలో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు తిలక్ వర్మ. ఎనిమిదో ఓవర్లో కుల్‌దీప్ వేసిన బంతిని చార్లెస్ భారీ షాట్ కొట్టబోయి గాలిలోకి లేపాడు. బౌండరీలైన్ వద్ద ఫీల్డింగ్‌లో వర్మ పరుగెత్తుకుంటూ వెళ్లి డ్రైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మొత్తానికి తొలి అంతర్జాతీయ మ్యాచ్ లో హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ అద్భుత ప్రతిభ కనబర్చడంతో తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.