Hardik Pandya
Hardik Pandya: సోషల్ మీడియాకు కాదేదీ అనర్హం. వాస్తవాలే కాదు వాస్తవాల్లాగే అనిపించిన విషయాలను కూడా వైరల్ చేసేస్తారు. ఇక సెలబ్రిటీల గురించైతే చెప్పనక్కర్లేదు. కొద్దిగా అనుమానం ఉన్నా కల్పనలు పేట్రేగిపోతాయి. ఈ క్రమంలోనే టీమిండియా ఆల్ రౌండర్, గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మీద పోలికలు మొదలయ్యాయి.
హార్దిక్ పాండ్యా ఫొటోను, WWE రెజ్లర్ కార్మెలో హేస్ ఫొటోతో మార్ఫింగ్ చేసిన ఫొటో వైరల్ గా మారింది.
ఈ ఫొటోను హేస్ స్వయంగా ట్విట్టర్‌లో.. హార్దిక్ పాండ్యా నన్ను ఇండియాలో ట్రెండింగ్ లో ఉంచాడు. అతనికి నా ప్రేమను తెలియజేస్తున్నా’ అంటూ పోస్టు పెట్టాడు.
Read Also: అహ్మదాబాద్ జట్టుకు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా
ఇక ఆ ఫొటోకు ‘వెంకటేశ్ అయ్యర్ ఆట చూసిన హార్దిక్ పాండ్యా ఇక NXTలో జాయిన్ అయిపోయాడా. కార్మెలో హేస్ గా పేరు మార్చుకున్నాడా. బెస్ట్ ఆఫ్ లక్’ అని ట్వీట్ చేశాడు.
అసలు కార్మెలో హేస్ ఎవరంటే.. NXT నార్త్ అమెరికన్ ఛాంపియన్ ప్రస్తుత ఛాంపియన్.. రీసెంట్ క్రూయిజర్ వెయిట్ ఛాంపియన్ రోడెరిక్ స్ట్రాంగ్ ను ఓడించాడు. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం టీమిండియాకు దూరంకాగా, ఐపీఎల్ లో గుజారత్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.