Asia Cup 2025 : జట్టు కోసం ఆడే ఆటగాళ్లని తీసుకోరా? రవిచంద్రన్ అశ్విన్ కామెంట్స్..
ఆసియాకప్(Asia Cup 2025)లో జైస్వాల్‌కు చోటు దక్కకపోవడం పై అశ్విన్ స్పందించాడు. జట్టులో చోటు కల్పించకపోవడం సరికాదన్నాడు

Asia Cup 2025 Ashwin Tears Into Ajit Agarkar Over Shock Selection Call
Asia Cup 2025 : సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. 15 మంది సభ్యులతో కూడిన బృందాన్ని సెలక్టర్లు మంగళవారం ప్రకటించారు. సూర్య నాయకత్వంలోనే భారత్ ఆడనుండగా, వైస్ కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ ఎంపిక అయ్యాడు. టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. టీ20 ప్రపంచకప్ 2024లో యశస్వి బ్యాకర్ ఓపెనర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
ఆసియాకప్‌లో జైస్వాల్‌కు చోటు దక్కకపోవడం పై అశ్విన్ స్పందించాడు. అతడి స్రైక్‌రేటు బాగుందని, జట్టులో చోటు కల్పించకపోవడం సరికాదన్నాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో అశ్విన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
Ashwin on Jaiswal –
Just like him, my biggest fear now is that he will start thinking about his place the next time he gets a chance and won’t play the brand of cricket he plays. pic.twitter.com/fY0XxTFVtx
— Priyansh (@bhhupendrajogi) August 19, 2025
‘టెస్టు క్రికెట్‌లో అవకాశం వచ్చినప్పుడు యశస్వి జైస్వాల్ దాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఇటీవల కాలంలో టీమ్ఇండియా తరుపున టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టి అత్యంత విజయవంతమైన క్రికెటర్ అతడు . ఏ ఫార్మాట్‌కు ఎంపిక అయినా కూడా పూర్తి న్యాయం చేస్తున్నాడు. ఓ దశలో నాయకత్వ రేసులో నిలిచిన ఆటగాడికి కనీసం జట్టులో చోటు దక్కకపోవడం షాక్ కు గురి చేసింది,’ అని అశ్విన్ అన్నాడు.
BCCI : బీసీసీఐ ప్లాన్ లీక్..! సూర్యకు చెక్..! ఆసియాకప్‌లో తేడా కొడితే..
ఇక టీ20ల్లో యశస్వి స్ట్రైక్‌రేటు 165 గా ఉందన్నాడు. వ్యక్తిగత ప్రదర్శన కోసం కాకుండా అతడు జట్టు కోసం ఆడతాడని అన్నాడు. ఈ జాబితాలో శ్రేయస్ అయ్యర్ కూడా ఉంటాడని అశ్విన్ అన్నాడు.
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్‌దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, హర్షిత్ రాణా, రింకూ సింగ్.