Mohammed Kaif : నిన్ను తీసేస్తున్నాం అని అక్ష‌ర్ ప‌టేల్‌కి ముందే చెప్పారా? సెల‌క్ట‌ర్ల‌కు మాజీ ఆట‌గాడి సూటి ప్ర‌శ్న‌..

అక్ష‌ర్ ప‌టేల్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌డం పై టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ కైఫ్ (Mohammed Kaif) తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు.

Mohammed Kaif : నిన్ను తీసేస్తున్నాం అని అక్ష‌ర్ ప‌టేల్‌కి ముందే చెప్పారా? సెల‌క్ట‌ర్ల‌కు మాజీ ఆట‌గాడి సూటి ప్ర‌శ్న‌..

Mohammed Kaif Comments on Shubman gill appointment as vice captain

Updated On : August 20, 2025 / 11:30 AM IST

Mohammed Kaif : ఆసియాక‌ప్ 2025 కోసం 15 మంది స‌భ్యులు గ‌ల బృందాన్ని బీసీసీఐ ప్ర‌క‌టించింది. సూర్య‌కుమార్ యాద‌వ్ నాయ‌క‌త్వంలోనే భార‌త్ బ‌రిలోకి దిగ‌నుంది. ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో అద్భుతంగా రాణించిన టెస్టు కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ టి20 జ‌ట్టులో చోటు ద‌క్కించుకోవ‌డ‌మే కాదు ఏకంగా వైస్ కెప్టెన్‌గా నియ‌మితుడ‌య్యాడు. ఈ క్ర‌మంలో ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో సూర్య‌కు డిప్యూటీగా ఉన్న అక్ష‌ర్ ప‌టేల్ వైస్ కెప్టెన్సీ ప‌ద‌విని కోల్పోయాడు.

అక్ష‌ర్ ప‌టేల్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌డం టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ కైఫ్ (Mohammed Kaif) తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు. అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయాన్ని అత‌డికి ముందుగానే తెలియ‌జేసి ఉంటార‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పాడు. మీడియా స‌మావేశం ద్వారా అత‌డికి ఈ విష‌యం తెలియ‌కూడ‌దు. అత‌డు ఎలాంటి త‌ప్పు చేయ‌లేదు. కాబ‌ట్టి అత‌డిని వైస్ కెప్టెన్సీ నుంచి ఎందుకు త‌ప్పించారో అత‌డికి వివ‌ర‌ణ ఇవ్వాల్సిందే అని కైఫ్ సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చాడు.

BCCI : బీసీసీఐ ప్లాన్‌ లీక్‌..! సూర్య‌కు చెక్..! ఆసియాక‌ప్‌లో తేడా కొడితే..

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో అక్ష‌ర్ ఎలా ఆడాడు?

ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఈ సిరీస్‌ను భార‌త్ 4-1తేడాతో విజ‌యం సాధించింది. ఈ ఐదు మ్యాచ్‌ల్లో అక్ష‌ర్ ప‌టేల్ 6 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌ల్లో అత‌డికి బ్యాటింగ్ చేసేందుకు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 భార‌త్ గెలుచుకోవ‌డంలోనూ అక్షర్ పటేల్ కీల‌క పాత్ర పోషించాడు. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ‌రిలోకి దిగిన అక్ష‌ర్ ప‌టేల్ 47 ప‌రుగులు చేశాడు. కోహ్లీతో క‌లిసి 72 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు.

Ajit Agarkar on Shreyas Iyer : ఐపీఎల్ లో విధ్వంసకర బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ ను ఎందుకు సెలక్ట్ చేయలేదు?.. అగార్కర్ ఆన్సర్ ఇదీ..

ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు..

సూర్య‌కుమార్ యాద‌వ్ (కెప్టెన్‌), శుభ్‌మ‌న్ గిల్ (వైస్ కెప్టెన్‌), అభిషేక్ శ‌ర్మ‌, తిల‌క్ వ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా, శివ‌మ్‌దూబే, అక్ష‌ర్ ప‌టేల్‌, జితేశ్ శ‌ర్మ‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల్దీప్ యాద‌వ్‌, సంజూ శాంస‌న్‌, హ‌ర్షిత్ రాణా, రింకూ సింగ్‌.