Hardik Pandya Kiss: సౌతాఫ్రికాతో చివరి టీ20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. 30 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది భారత్. ఈ గెలుపుతో 5 మ్యాచుల టీ20 సిరీస్ ను 3-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇంట్రస్టింగ్ సీన్ కనిపించింది. భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, అతడి గర్ల్ ఫ్రెండ్ మహైకా ముద్దులు (ఫ్లైయింగ్ కిస్) ఇచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ మ్యాచ్ లో హార్ధిక పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్ ఆడాడు. సఫారీ బౌలర్లపై చెలరేగిపోయాడు. పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. క్రీజులోకి వచ్చింది మొదలు దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించిన పాండ్యా.. ఆ తర్వాత కూడా చెలరేగి ఆడాడు. బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 25 బంతుల్లోనే 63 పరుగులు చేసి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. పాండ్య ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి.
ఈ క్రమంలో టీ20ల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన భారత రెండో క్రికెటర్ గా ఘనత సాధించాడు. 2007 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ 12 బంతుల్లోనే అర్థ శతకం కొట్టాడు.
ఈ మ్యాచ్ చూసేందుకు పాండ్యా గర్ల్ ఫ్రెండ్ మహైక శర్మ స్టేడియానికి వచ్చింది. హాఫ్ సెంచరీ బాదిన తర్వాత పాండ్యా బ్యాట్ ను పైకి ఎత్తాడు. అదే సమయంలో స్టాండ్స్ లో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ కు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చి సెలబ్రేషన్ చేసుకున్నాడు. పాండ్యా ఫ్లైయింగ్ కిస్ లు చూసిన మహిక కూడా అదే స్టైల్ లో రియాక్ట్ అయ్యింది. సంతోషంతో కేరింతలు కొడుతూ రిటర్న్ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి తన బాయ్ ఫ్రెండ్ ను సపోర్ట్ చేసింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: మ్యాచ్ లే స్టార్ట్ కాలేదు.. అప్పుడే టాప్ 4 అంట..
Pandya’s special gesture for Girlfriend H🩷 Mahieka steals the show in Ahmedabad today ♥️ #INDvSA #Hardikpandya𓃵
— Vijay (@TechGuy_Vijay) December 19, 2025