ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్ బుమ్రా గురించి హార్దిక్ పాండ్యా ఏమన్నాడో తెలుసా? 

RCB Vs MI: మ్యాచును త్వరగా ముగించాలని తామేం చెప్పలేదని, అయినప్పటికీ తమ బ్యాటర్లకు ఆ విషయం తెలుసని చెప్పాడు.

@mipaltan

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ముంబయి ఇండియన్స్‌ ధాటిగా ఆడి విజయ దుందుభి మోగించడంలో కీలకంగా నిలిచిన బుమ్రాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బుమ్రా అద్భుత బౌలింగ్‌తో 5 వికెట్లు తీసిన విషయం తెలిసిందే. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

దీనిపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందిస్తూ.. బుమ్రాలాంటి బౌలర్ తమ జట్టులో ఉండడం తమ అదృష్టమని చెప్పాడు. బుమ్రా బాగా ప్రాక్టీస్ చేశాడని అన్నాడు. బుమ్రాకి చాలా అనుభవం ఉందని, అలాగే, అతడిపై అతడికి చాలా నమ్మకం ఉందని చెప్పాడు.

తాము గెలిచిన తీరు బాగా ఆకట్టుకుందని హార్దిక్ తెలిపాడు. తమకు అవసరమైతే ఎక్స్‌ట్రా బౌలర్ ను వాడుకునేలా ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అవకాశం ఉందని అన్నాడు. ఓపెనర్లు రోహిత్, ఇషాన్ అద్భుతంగా ఆడిన తీరు మ్యాచును మిగతా బ్యాటర్లు త్వరగా ముగించేలా చేసిందని తెలిపాడు.

మ్యాచును త్వరగా ముగించడమే ప్రధానంగా మారిందన్నాడు. మ్యాచును త్వరగా ముగించాలని తామేం చెప్పలేదని, అయినప్పటికీ తమ బ్యాటర్లకు ఆ విషయం తెలుసని చెప్పాడు. కాగా, ఆర్సీబీ ఇచ్చిన 197 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 15.3 ఓవర్లలోనే ఛేదించారు.

Also Read : ఇషాన్, సూర్యకుమార్ విధ్వంసం.. ముంబై దెబ్బకు బెంగళూరు బేజారు!

ట్రెండింగ్ వార్తలు