IPL 2024 : అధికారిక ప్రకటన వచ్చేసింది..! ముంబై జట్టులోకి హార్థిక్.. గుజరాత్ కెప్టెన్ గా గిల్ .. ఆర్సీబీలోకి గ్రీన్

హార్ధిక్ పాండ్యా ముంబై జట్టుకు వెళ్లే విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ ను కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాళ్లను

Hardik Pandya

Shubman Gill : ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెండు సీజన్ లలో గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన హార్ధిక్ పాండ్యా ఎట్టకేలకు తిరిగి ముంబై ఇండియన్స్ జట్టుకు వెళ్లాడు. ఈ మేరకు ముంబై జట్టు సోమవారం అధికారిక ప్రకటన చేసింది. హార్ధిక్ జట్టును వీడటంతో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ను ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. మరోవైపు ముంబై జట్టులో కొనసాగుతూ వచ్చిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ ముందుగానే అనుకున్నట్లుగానే రాయల్ ఛాలెంజర్ జట్టులోకి వెళ్లాడు.

Also Read : CSK : ఐపీఎల్ 2024 ఆడ‌నున్న ధోనీ.. చెన్నై సూప‌ర్ కింగ్స్ విడుద‌ల చేసిన‌, అట్టిపెట్టుకున్న ఆట‌గాళ్ల లిస్ట్ ఇదే..

గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్.. 2022లో జట్టును విజేతగా నిలిపాడు. 2023లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు చేరింది. అయితే, కొద్దిరోజులుగా హార్ధిక్ పాండ్యా ముంబై జట్టులోకి వెళ్తున్నాడని, ఆ మేరకు గుజరాత్, ముంబై జట్ల మధ్య ఒప్పందం కుదిరినట్లు వార్తలు వచ్చాయి. గుజరాత్ టైటాన్స్ జట్టును హార్దిక్ వీడితే ఆ జట్టు కెప్టెన్ గా ఎవరు ఉంటారనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అయితే, జట్టు కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ను ప్రకటిస్తూ జట్టు యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది.

Also Read : Ravichandran Ashwin : ముంబై జట్టులోకి హార్ధిక్ పాండ్యా? అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. జట్టు ఎలా ఉంటుందో చెప్పేశాడు.

హార్ధిక్ పాండ్యా ముంబై జట్టుకు వెళ్లే విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ ను కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాళ్లను రిటెన్షన్ తర్వాత తమ ఖాతాలో రూ. 15.25 కోట్లను మాత్రమే కలిగి ఉంది. దీంతో పాండ్యా ను జట్టులోకి తీసుకొనేందుకు తొలుత అవకాశం లేకుండా పోయింది. కానీ, ముంబై ఇండియన్స్ ఆ జట్టులోని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ (రూ. 17.5కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది) వదులుకుంది. కెమెరాన్ గ్రీన్ ను బెంగళూరుకు ముంబయి ఇచ్చేసింది. అయితే, హార్ధిక్, గ్రీన్ జట్టు మార్పునకు బీసీసీఐ పచ్చజెండా ఊపినప్పటికీ సోమవారం ఉదయం వరకు అధికారిక ప్రకటన రాలేదు. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఈ విషయంపై ముంబై జట్లు అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం ముంబై జట్టుకు రోహిత్ కెప్టెన్ గా ఉన్నాడు.. వచ్చే సీజన్ లో రోహితే కెప్టెన్ గా ఉంటాడా? హార్దిక్ ను కెప్టెన్ గా ప్రకటిస్తారా? అనే అంశం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ముంబై జట్టులోకి తిరిగి రావడం పట్ల హార్ధిక్ పాండ్యా సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు