T20 World Cup 2026 : వర్షం వల్ల ఐర్లాండ్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ రద్దైతే.. ఆస్ట్రేలియాకు లాభమా? నష్టమా?
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) భాగంగా మంగళవారం పల్లెకెలె వేదికగా ఐర్లాండ్, జింబాబ్వే జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కు వర్షం ఆటంకం ఏర్పడింది.
IF IRE vs ZIM match abandoned due to rain What Australia chances to qualify super 8
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా మంగళవారం పల్లెకెలె వేదికగా ఐర్లాండ్, జింబాబ్వే జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కు వర్షం ఆటంకం ఏర్పడింది. వరుణుడి కారణంగా ఇంత వరకు టాస్ కూడా వేయలేదు.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సూపర్-8 బెర్తును ఖాయం చేసుకోవాలని జింబాబ్వే ఆరాటపడుతోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సూపర్-8 అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని ఐర్లాండ్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ విజయం సాధిస్తే.. ఐర్లాండ్‌తో పాటు ఆస్ట్రేలియా సూపర్-8 అవకాశాలు సజీవంగా ఉంటాయి.
వర్షం కారణంగా రద్దైతే ఆస్ట్రేలియా పరిస్థితి ఏంటి?
శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్ జట్లు గ్రూప్-బిలో ఉన్నాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన శ్రీలంక ఇప్పటికే సూపర్-8కి అర్హత సాధించింది. మిగిలిన ఒక్క స్థానం కోసం జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు పోటీపడుతున్నాయి.
ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన జింబాబ్వే నాలుగు పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్లే ఉన్నాయి. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
T20 World Cup 2026 : చరిత్ర సృష్టించిన యువరాజ్ సమ్రా.. టీ20 ప్రపంచకప్‌లో ఏకైక బ్యాటర్..
ఒకవేళ వర్షం కారణంగా మంగళవారం జరగాల్సిన జింబాబ్వే వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ రద్దు అయితే అప్పుడు ఇరు జట్లకు చెరొక పాయింట్ ను కేటాయిస్తారు. దీంతో జింబాబ్వే ఖాతాలో 5 పాయింట్లు ఉంటాయి. అప్పుడు జింబాబ్వే సూపర్-8కి అర్హత సాధిస్తుంది. ఆస్ట్రేలియా ఇంటి ముఖం పడుతుంది. ఆస్ట్రేలియాతో పాటు ఒమన్, ఐర్లాండ్ లు కూడా తదుపరి దశను చేరకుండానే టీ20 ప్రపంచకప్ 2026 నుంచి నిష్ర్కమిస్తాయి.
