CSK : ఐపీఎల్ 2024 ఆడ‌నున్న ధోనీ.. చెన్నై సూప‌ర్ కింగ్స్ విడుద‌ల చేసిన‌, అట్టిపెట్టుకున్న ఆట‌గాళ్ల లిస్ట్ ఇదే..

Chennai Super Kings : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ఆరంభ సీజ‌న్ 2008 నుంచి ఆడుతున్న అతి కొద్ది మంది ఆట‌గాళ్ల‌లో మ‌హేంద్ర సింగ్ ధోని ఒక‌రు

CSK : ఐపీఎల్ 2024 ఆడ‌నున్న ధోనీ.. చెన్నై సూప‌ర్ కింగ్స్ విడుద‌ల చేసిన‌, అట్టిపెట్టుకున్న ఆట‌గాళ్ల లిస్ట్ ఇదే..

Chennai Super Kings

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ఆరంభ సీజ‌న్ 2008 నుంచి ఆడుతున్న అతి కొద్ది మంది ఆట‌గాళ్ల‌లో మ‌హేంద్ర సింగ్ ధోని ఒక‌రు. అత‌డి నాయ‌క‌త్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఐపీఎల్ 2023 సీజ‌న్ ధోనికి ఆఖ‌రిది అని ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ఫైన‌ల్ మ్యాచ్ అనంత‌రం ధోనీ మాట్లాడుతూ అన్ని స‌హ‌క‌రిస్తే మ‌రో సీజ‌న్ ఆడుతాన‌ని మాట ఇచ్చాడు. అయితే.. ఎప్పుడు ఏం వార్త వినాల్సి వ‌స్తుందోన‌ని అభిమానులు ఇన్ని రోజులుగా కంగారు ప‌డుతూ వ‌చ్చారు.

ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు సంబంధించి అన్నీ ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకునే, విడుద‌ల చేసే ఆట‌గాళ్ల జాబితాల‌ను స‌మ‌ర్పించేందుకు బీసీసీఐ విధించిన స‌మ‌యం ముగిసింది. ఈ క్ర‌మంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ తాము అట్టిపెట్టుకునే, విడుద‌ల చేసిన‌ ఆట‌గాళ్ల జాబితాను ప్ర‌క‌టించింది. ధోనిని ఈ ఏడాది కూడా చెన్నై రిటైన్ చేసుకుంది. దీంతో ఐపీఎల్ 2024 సీజ‌న్‌ను ధోని ఆడ‌నున్నాడు. ఇది నిజంగా చెన్నై సూప‌ర్ కింగ్స్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.

Babar Azam : బ్యాట్‌తో వెంటప‌డ్డ బాబ‌ర్‌.. రిజ్వాన్ ప‌రుగోప‌రుగు.. వీడియో

ధోనీతో పాటు ర‌వీంద్ర జ‌డేజా, అజింక్యా ర‌హానే వంటి ఆట‌గాళ్ల‌ను చెన్నై రిటైన్ చేసుకోగా ఇంగ్లాండ్ ఆల్‌రౌండ‌ర్ బెన్‌స్టోక్స్ , డ్వేన్ ప్రిటోరియ‌స్ ల‌ను వ‌దిలి వేసింది.

చెన్నై రిటైన్ చేసుకున్న ప్లేయ‌ర్ల‌ లిస్ట్..

మ‌హేంద్ర సింగ్ ధోని, ర‌వీంద్ర జ‌డేజా, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్‌, మొయిన్ అలీ, శివ‌మ్ దూబే, రాజ్య‌వ‌ర్ధ‌న్ హంగేర్క‌ర్, మిచెల్ శాంట్న‌ర్, దీప‌క్ చాహ‌ర్, తుషార్ దేశ్‌పాండే, మ‌తీశ ప‌తిరాన‌, సిమ‌ర్‌జిత్ సింగ్, ప్ర‌శాంత్ సోలంకి, మహీశ్ తీక్ష‌ణ‌, అజింక్యా ర‌హానే, షేక్ ర‌షీద్, నిషాంత్ సింధు, అజ‌య్ మండ‌ల్

చెన్నై వ‌దిలివేసిన ఆట‌గాళ్ల లిస్ట్‌..
బెన్ స్టోక్స్‌, అంబ‌టి రాయుడు (రిటైర్మెంట్‌), డ్వేన్ ప్రిటోరియ‌స్‌, కైల్ జెమీస‌న్, ఆకాశ్ సింగ్‌, సిసంద మ‌గ‌ల, భగ‌వ‌త్ వ‌ర్మ‌, సుభ్రాన్షు సేనాప‌తి

చెన్నై మొత్తంగా 8 మంది ఆట‌గాళ్ల‌ను విడుద‌ల చేయ‌డంతో ప్ర‌స్తుతం ఆ జ‌ట్టు మ‌నీ ప‌ర్సులో రూ.32.2 కోట్లు ఉన్నాయి. వేలంలో 9 మంది ఆట‌గాళ్ల‌ను తీసుకునే అవ‌కాశం ఉంది. ఇందులో ముగ్గురు విదేశీ, ఆరుగురు స్వ‌దేశీ ఆట‌గాళ్ల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

Bowler Bizarre Action : విచిత్ర‌మైన బౌలింగ్ యాక్ష‌న్‌.. అయోమ‌యంలో బ్యాట‌ర్‌.. ఎక్క‌డ ఉన్నావ్ బాసూ..!