Babar Azam : బ్యాట్‌తో వెంటపడ్డ బాబర్.. రిజ్వాన్ పరుగోపరుగు.. వీడియో
Babar Azam-Mohammad Rizwan : ఓవర్ పూర్తి అయ్యిందని బాబర్ ఆజాం క్రీజును వదిలి ముందుకు వెళ్లాడు. వికెట్ కీపింగ్ చేస్తున్న రిజ్వాన్ బంతితో వికెట్లను పడగొట్టాడు.

Babar Azam-Mohammad Rizwan
భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. లీగు దశలో తొమ్మిది మ్యాచులు ఆడిన ఆ జట్టు నాలుగు మ్యాచుల్లోనే విజయం సాధించింది. మిగిలిన ఐదు మ్యాచుల్లో ఓడిపోవడంతో ఆ జట్టు సెమీస్ చేరకుండానే నిష్ర్కమించింది. దీంతో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ క్రమంలో ఆ జట్టు బౌలింగ్ కోచ్ పదవికి మోర్నీ మోర్కెల్ రాజీనామా చేశాడు.
మెగా టోర్నీలో 9 మ్యాచులు ఆడిన బాబర్ ఆజాం 320 పరుగులు మాత్రమే చేశాడు. అటు బ్యాటర్‌గా ఇటు కెప్టెన్‌గా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ తప్పుకున్నాడు. బాబర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో షాన్ మసూద్ ను టెస్ట్ కెప్టెన్‌గా, షహీన్ అఫ్రిదిని టీ20 కెప్టెన్‌గా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నియమించింది.
IPL Updates: కీలక ప్లేయర్ ను వదులుకున్న కేకేఆర్ జట్టు .. ఢిల్లీ క్యాపిటల్స్ లోనే పృథ్వీ షా
ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమవుతోంది. ఆసీస్ పర్యటనలో ముందుగా మూడు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 14 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు పాక్ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
లాహోర్‌లోని హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో టెస్టు సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టు ప్రాక్టీస్‌ను మొదలెట్టింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. ఓవర్ పూర్తి అయ్యిందని బాబర్ ఆజాం క్రీజును వదిలి ముందుకు వెళ్లాడు. వికెట్ కీపింగ్ చేస్తున్న రిజ్వాన్ బంతితో వికెట్లను పడగొట్టాడు. వెంటనే ఔట్ అంటూ అప్పీల్ చేశాడు. దీన్ని చూసిన బాబర్ తన చేతిలో ఉన్న బ్యాటుతో రిజ్వాన్‌ను కొట్టేందుకు ముందుకు వెళ్లాడు. రిజ్వాన్ పరిగెత్తడడంతో బాబర్ అతడి వెనకానే పరిగెత్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Babar ?? pic.twitter.com/OnLIv1t4A7
— Hassan (@HassanAbbasian) November 25, 2023
Mohammed Shami : కారు ప్రమాదం నుంచి వ్యక్తిని కాపాడిన క్రికెటర్ మహ్మద్ షమీ