Hardik Pandya : గిల్‌కు ఎసరు పెట్టిన హార్దిక్ పాండ్యా.. కెప్టెన్సీ ఇస్తే వస్తా.. గుజరాత్‌కు ఆఫర్..! షాకిచ్చిన జీటీ!
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తిరిగి గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరేందుకు ఆసక్తి చూపినప్పటికీ, కెప్టెన్సీ షరతు కారణంగా ఆ ప్రతిపాదనకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.
- Thota Vamshi Kumar
- Updated on- August 12, 2026 / 11:16 AM IST
Hardik seeks return to Gujarat Titans with captaincy rider reports
Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరేందుకు ఆసక్తి చూపినప్పటికీ, కెప్టెన్సీ షరతు కారణంగా ఆ ప్రతిపాదనకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం పాండ్యాను తిరిగి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, తనను కెప్టెన్‌గా నియమిస్తేనే తిరిగి వస్తానని ఆయన షరతు విధించినట్లు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పేర్కొంది.
2022లో గుజరాత్ టైటాన్స్ అరంగేట్ర సీజన్‌లోనే పాండ్యా కెప్టెన్‌గా జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించాడు. అనంతరం 2024లో ముంబై ఇండియన్స్‌కు తిరిగి వెళ్లాడు. అయితే.. ఇప్పుడు మరోసారి గుజరాత్ జట్టుకు తిరిగి వచ్చే అవకాశంపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
పాండ్యాను తిరిగి తీసుకునే అంశంపై గుజరాత్ టైటాన్స్ ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తోనూ చర్చించినట్లు సమాచారం. పాండ్యా తిరిగి రావడంపై గిల్‌కు అభ్యంతరం లేకపోయినా, కెప్టెన్సీ బాధ్యతలు మాత్రం అప్పగించాలన్న షరతుకు యాజమాన్యం అంగీకరించలేదని ఓ వర్గం తెలిపింది.
Cristiano Ronaldo : పెళ్లి చేసుకున్న పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో..
అయితే.. ఈ వ్యవహారంపై గుజరాత్ టైటాన్స్ ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు. మరోవైపు.. పాండ్యా ప్రతినిధి మాత్రం ఆయన ఏ ఫ్రాంచైజీతోనూ నేరుగా ట్రేడ్ లేదా బదిలీపై చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. ఎవరైనా సంప్రదించి ఉంటే అది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి తెలియజేయబడుతుందని తెలిపాడు.
పాండ్యా భవిష్యత్తుపై అనిశ్చితి..
ఇటీవల ముంబై ఇండియన్స్‌లో పాండ్యా భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. పాండ్యాను కెప్టెన్‌గా కొనసాగించేందుకు జట్టు యాజమాన్యం ఆసక్తిగా లేదని, అతని పాత్రపై కూడా సమీక్ష జరుగుతోందని గతంలో వార్తలు వచ్చాయి. ఐపీఎల్ 2026 సీజన్‌లో పాండ్యా నాయకత్వంలో ముంబై జట్టు 14 మ్యాచ్‌లు ఆడగా 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన చివరి మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కోచింగ్ సిబ్బంది సీనియర్ ఆటగాళ్లకు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. డేటా ఆధారంగా కోచ్‌లు ఇచ్చిన సూచనలను కొంతమంది ఆటగాళ్లు పాటించలేదని, ఇకపై ఎక్కడ ఆడినా కోచ్‌ల సూచనలను పాటించేలా ఉండాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
Sara Tendulkar : సచిన్ కూతురు మోడలింగ్ చేస్తోందా? సారా టెండూల్కర్ మోడ్రన్ ఫోటోలు వైరల్..
ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు, అభిమానులతో పాండ్యా సంబంధాలు కూడా గత కొంతకాలంగా అంత సానుకూలంగా లేవు. 2022లో ముంబై ఇండియన్స్ నుంచి విడుదలైన పాండ్యా గుజరాత్ టైటాన్స్‌లో చేరి అదే జట్టుకు కెప్టెన్‌గా టైటిల్ అందించాడు. ఆ తరువాత 2024లో ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చి రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. దీంతో ముంబై అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. ఆ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఆ తరువాత కూడా అతడి నాయకత్వంలో ముంబై చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు.
