ఆసియా రెజ్లింగ్ చాంపియన్ షిప్‌లో భారత్ 16 పతకాలు పట్టేసింది. ఆదివారం జరిగిన పోటీల్లో 82 కేజీల విభాగంలో హర్‌ప్రీత్ రజతం గెలుచుకోవడంతో.. చివరి రోజు పోటీల్లో 60కేజీల విభాగంలో గ్యానేందర్ కాంస్యంతో మెరిశాడు. వీటితో కలిపి భారత్‌కు 16 పతకాలు వచ్చి చేరాయి. వాటిలో ఒకటి స్వర్ణం కాగా, మూడు రజతం, 4 కాంస్యం, మహిళల్లో 4 కాంస్యాలు, గ్రీకు రోమన్ రెజ్లర్ల విభాగంలో 3 రజతం, 1 కాంస్యంలు దక్కించుకున్నారు.
స్వర్ణం దక్కించుకోవాల్సిన పోటీలో హర్‌ప్రీత్ తీవ్రంగా శ్రమించాడు. కానీ, ఆఖరి బౌట్ వరకూ ప్రయత్నించి విఫలమైయ్యాడు. టైటిల్ కోసం జరిగిన ఆఖరి బౌట్‌లో ఇరాన్‌కు చెందిన సయ్యద్ మోరాద్ అబ్ద్‌వలీ చేతిలో 0-8తో ఓటమికి గురైయ్యాడు. దీంతో చివరకు సిల్వర్ పతకం అతణ్ని వరించింది.
మరో రెజ్లింగ్ స్టార్ గ్యానేందర్ తైపాయ్‌కు చెందిన జూ చీ హుయాంగ్‌ను చిత్తుగా ఓడించి మూడో స్థానంలో నిలిచాడు.