Harshit Rana : కివీస్‌తో మూడో టెస్టుకు హ‌ర్షిత్ రాణా.. క్లారిటీ ఇచ్చిన అభిషేక్ నాయ‌ర్‌

మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే న్యూజిలాండ్ చేతిలో భార‌త్ టెస్టు సిరీస్ ఓడిపోయింది.

Harshit Rana Not Included In Squad For 3rd Test

Harshit Rana : మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే న్యూజిలాండ్ చేతిలో భార‌త్ టెస్టు సిరీస్ ఓడిపోయింది. 12 ఏళ్ల త‌రువాత తొలిసారి భార‌త్ స్వ‌దేశంలో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. ఈ క్ర‌మంలో ముంబై వేదిక‌గా న‌వంబ‌ర్ 1 నుంచి మూడో టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఈ టెస్టులో గెలిచి ప‌రువు ద‌క్కించుకోవాల‌ని భార‌త్ ఆరాట‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలో జ‌ట్టులో ప‌లు మార్పులు ఉంటాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

కివీస్‌తో టెస్టు సిరీస్‌కు ట్రావెల్ రిజ‌ర్వ్‌గా ఎంపికైన కేకేఆర్ పేస‌ర్ హ‌ర్షిత్ రాణా మూడో టెస్టులో ఆడిస్తార‌ని వార్త‌లు వ‌స్తుండ‌గా దీనిపై టీమ్ఇండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయ‌ర్ స్పందించాడు. జ‌ట్టులో ఎలాంటి మార్పులు ఉండ‌బోవ‌ని స్ప‌ష్టం చేశాడు. రెండో టెస్టులో ఆడిన జ‌ట్టే మూడో మ్యాచ్ లోనూ బ‌రిలోని దిగ‌నుంద‌న్నాడు.

ICC Test Rankings : బుమ్రా అగ్ర‌స్థానం గ‌ల్లంతు.. మూడో స్థానానికి య‌శ‌స్వి జైస్వాల్‌

జ‌ట్టులో ఎలాంటి చేరిక‌లు లేవు. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ గురించి ఆలోచించ‌డం లేదు. ప్ర‌తి వారం ముఖ్య‌మే. ప్ర‌తి రోజు కీల‌క‌మే. ప్ర‌స్తుతం చివ‌రి టెస్టు మ్యాచ్ పైనే ఫోక‌స్ పెట్టాం అని ముంబైతో మ్యాచ్‌కు ముందు జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో అభిషేక్ నాయ‌ర్ తెలిపారు.