ICC Test Rankings : బుమ్రా అగ్రస్థానం గల్లంతు.. మూడో స్థానానికి యశస్వి జైస్వాల్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది.

ICC Test Rankings Jasprit Bumrah loses No 1 rank to Kagiso Rabada
ICC Test Rankings : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తన టాప్ ర్యాంక్‌ను కోల్పోయాడు. రెండు స్థానాలు దిగజారి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
టెస్టుల్లో బంతుల పరంగా అత్యంత వేగంగా 300 వ వికెట్ తీసిన ఆటగాడిగా రబాడ నిలిచిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్ రెండు స్థానాలు దిగజరి నాలుగో స్థానానికి పడిపోయాడు.
Smriti Mandhana : చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. భారత మహిళా క్రికెట్‌లో ఒకే ఒక ప్లేయర్
టాప్ -5 టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్..
కగిసో రబాడ (దక్షిణాఫ్రికా) – 860 రేటింగ్ పాయింట్లు
జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 847 రేటింగ్ పాయింట్లు
జస్ ప్రీత్ బుమ్రా (భారత్) – 846 రేటింగ్ పాయింట్లు
రవిచంద్రన్ అశ్విన్ (భారత్) – 831 రేటింగ్ పాయింట్లు
పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) – 820 రేటింగ్ పాయింట్లు
ఇక బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. టాప్ -2 స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ అగ్రస్థానంలో, కివీస్ ప్లేయర్ కేన్ విలిమమ్సన్ రెండో ర్యాంకో కొనసాగనున్నాడు. ఇక టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఓ స్థానం మెరుగుపరచుకుని నాలుగో స్థానానికి చేరుకున్నాడు. రిషబ్ పంత్ ఐదు స్థానాలు మెరుగుపరచుకుని ఐదో స్థానానికి చేరుకున్నాడు.
IND vs NZ : మూడో టెస్టుకు ముందు టీమ్ఇండియా కీలక నిర్ణయం.. పిచ్ ఎలా స్పందిస్తుందంటే?
టాప్ -5 టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్..
జోరూట్ (ఇంగ్లాండ్) – 903 రేటింగ్ పాయింట్లు
విలియమ్సన్ (న్యూజిలాండ్) – 813 రేటింగ్ పాయింట్లు
యశస్వి జైస్వాల్ (భారత్) – 790 రేటింగ్ పాయింట్లు
హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్) – 778 రేటింగ్ పాయింట్లు
స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) – 757 రేటింగ్ పాయింట్లు