Hashmatullah Shahidi : అఫ్గానిస్థాన్ వన్డే కెప్టెన్ పదవికి హష్మతుల్లా షాహిదీ రాజీనామా

అఫ్గానిస్థాన్ సీనియర్ ఆట‌గాడు హష్మతుల్లా షాహిదీ (Hashmatullah Shahidi ) వన్డే జట్టు కెప్టెన్ పదవికి రాజీనామా చేశారు.

Hashmatullah Shahidi Steps Down As Afghanistan ODI Captain

Hashmatullah Shahidi : అఫ్గానిస్థాన్ సీనియర్ ఆట‌గాడు హష్మతుల్లా షాహిదీ వన్డే జట్టు కెప్టెన్ పదవికి రాజీనామా చేశారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే తాను త‌ప్పుకుంటున్నాన‌ని చెప్పుకొచ్చాడు. అయితే ఆటగాడిగా వన్డే జట్టుకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.

‘పూర్తి గౌరవం, సమ్మతితో అఫ్గానిస్థాన్ వన్డే జట్టు కెప్టెన్ పదవికి రాజీనామా చేస్తున్నాను. జట్టు కెప్టెన్‌గా సేవలందించడం నాకు గొప్ప గౌరవం. నిజాయితీ, ఐక్యత, అంకితభావంతో ఈ బాధ్యతను నిర్వర్తించినందుకు గర్వంగా ఉంది.’ అని షాహిదీ సోష‌ల్ మీడియాలో పేర్కొన్నారు.

David Warner : తాగి వాహ‌నం న‌డిపిన డేవిడ్ వార్న‌ర్‌.. ఆగ‌స్టు 18న శిక్ష విధించ‌నున్న కోర్టు..

31 ఏళ్ల షాహిదీ.. 2022 ప్రారంభంలో అఫ్గానిస్థాన్ వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో అఫ్గానిస్థాన్ 2023 వన్డే ప్రపంచకప్‌తో పాటు 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ పాల్గొంది.

2023 ప్రపంచకప్‌లో భారత్‌పై జరిగిన మ్యాచ్‌లో షాహిదీ 88 బంతుల్లో 80 పరుగులు చేసి జట్టుకు 272 పరుగుల గౌరవప్రదమైన స్కోరు అందించారు. అయితే రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఆ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఈ మెగాటోర్నీలో అఫ్గానిస్థాన్ జ‌ట్టు చరిత్రాత్మక ప్రదర్శన చేసింది. ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ వంటి బలమైన జట్లపై విజయాలు సాధించి సెమీఫైనల్‌కు చేరువ వరకు వెళ్లింది.

IND vs SL : ఆ ఒక్క‌డి కోసం శ్రీలంక టెస్టు సిరీస్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న వాయిదా..! తోపు ప్లేయ‌ర్ కానే కాదు.. అయినా గానీ బీసీసీఐ ఎందుకిలా చేస్తోంది?

ఇదిలా ఉండగా.. వచ్చే నెల ఐర్లాండ్‌తో జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌కు ముందు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త వన్డే కెప్టెన్‌ను ప్రకటించనుంది.