How can 45 thousand tickets be sold in ten minutes Khairatabad MLA Danam Nagender
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లకు టికెట్లు దొరకకపోవడం దారుణం అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. 10 నిమిషాల్లో 45 వేల టికెట్స్ ఎలా అమ్ముడుపోతాయ్ అని ప్రశ్నించారు. టికెట్ల దొరకకపోవడానికి ప్రధాన కారణం హెచ్‌సీఏ(హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) అని 10టీవీతో మాట్లాడుతూ దానం నాగేందర్ ఆరోపించారు.
ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నారు అనే ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించారు. 45 వేల టికెట్లు 10 నిమిషాల్లో ఎలా అమ్ముడుపోతాయన్నారు. టికెట్ల అమ్మకాలు పారదర్శకంగా ఉండాలన్నారు. టికెట్లు దొరకకపోవడానికి ప్రధాన కారణం HCA అని అన్నారు. కంప్లమెంటరీ పాస్ లను HCA బ్లాక్‌లో అమ్ముతుందన్నారు. తాను DNR అకాడమీ ని నడుపుతున్నానని, బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసినట్లు చెప్పారు. హెచ్‌సీఏ తీరు పై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
Michael Clarke : హార్దిక్ పై ఎడతెగని హేళనను ఆపేందుకు ఏకైక మార్గం అదే : మైకేల్ క్లార్క్
ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు హైదరాబాద్‌లో ఆడే మ్యాచుల్లో హైదరాబాద్ క్రీడాకారుడు ఉండేలా చూడాలన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా కూడా హైదరాబాద్ క్రీడాకారులు లేకపోవడం దారుణమన్నారు. బ్లాక్ టికెట్స్ దందా పై చర్యలు తీసుకోవాలని, రానున్న మ్యాచుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు.