BWF rankings : కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ సాధించిన హెచ్‌ఎస్‌ ప్రణయ్‌.. సింధు ర్యాంక్ ఎంతంటే..?

ఇటీవ‌ల భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌(HS Prannoy) ప్ర‌పంచ బ్మాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్స్‌లో (World Badminton Championship) కాంస్య ప‌త‌కాన్ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

BWF Rankings

BWF rankings : ఇటీవ‌ల భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌(HS Prannoy) ప్ర‌పంచ బ్మాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్స్‌లో (World Badminton Championship) కాంస్య ప‌త‌కాన్ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌(BWF Rankings)లో అత‌డు త‌న కెరీర్ అత్యుత్త‌మ ర్యాంక్‌ను అందుకున్నాడు. మంగ‌ళ‌వారం బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్ ఫెడ‌రేష‌న్ (BWF) ర్యాంకింగ్స్‌ను విడుద‌ల చేయ‌గా.. మూడు స్థానాలు మెరుగుప‌ర‌చుకున్న ప్ర‌ణ‌య్ ఆరో స్థానానికి చేరుకున్నాడు.

Virat Kohli : మ‌ళ్లీ చెబుతున్నా.. ఎవరితోనైనా పెట్టుకోండి కానీ.. కోహ్లితో వ‌ద్దు.. బౌల‌ర్ల‌కు కీల‌క సూచ‌న‌

గ‌తేడాది డిసెంబ‌ర్ నుంచి టాప్‌-10లో కొన‌సాగుతూ వ‌స్తున్నాడు ప్ర‌ణ‌య్‌. ప్ర‌పంచ బ్మాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్స్ క్వార్ట‌ర్స్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ అయిన డెన్మార్క్‌కు చెందిన విక్ట‌ర్ అక్సెల్సెన్‌పై విజ‌యం సాధించి సెమీస్‌కు చేరుకున్నాడు. అయితే.. అక్క‌డ థాయ్‌లాండ్‌కు చెందిన కున్లావ‌త్ వితిద్స‌న్ చేతిలో ఓడి కాంస్యంతో స‌రిపెట్టుకున్నాడు. మిగ‌తా వారిలో లక్ష్యసేన్ (Lakshya Sen) 12వ ర్యాంక్‌లో నిల‌వ‌గా కిడాంబి శ్రీకాంత్‌(Kidambi Srikanth) 20వ ర్యాంక్‌లో కొన‌సాగుతున్నారు.

CPL 2023 : అగో.. రెడ్ కార్డు వ‌చ్చింది.. నువ్వు బ‌య‌టికి పో.. పాపం సునీల్ న‌రైన్‌.. పొలార్డ్ ఇలా చేశావేంటి..?

పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌- చిరాగ్ జోడి రెండో ర్యాంకును నిలబెట్టుకోగా..అటు మ‌హిళ‌ల విభాగంలో పీవీ సింధు ఒక స్థానం ఎగ‌బాకి 14వ ర్యాంకుకు చేరింది.