Huge blow for Team India Star wicketkeeper ruled out of Australia series
IND vs AUS : ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత మహిళా క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ యాస్తిక భాటియా గాయం కారణంగా ఈ పర్యటకు దూరమైంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తెలియజేసింది. యాస్తిక భాటియా మణికట్టు గాయంతో బాధపడుతోందని తెలిపింది. ఆమె స్థానంలో ఉమా చెత్రీని ఎంపిక చేశారు.
మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఆడుతూ యస్తిక గాయపడినట్లు సమాచారం. ‘మణికట్టు గాయం కారణంగా యాస్తిక భాటియా ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల వన్డే సిరీస్‌కు దూరమైంది. బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఆమె కోలుకుంటోంది. ఆమె స్థానంలో ఉమాచెత్రీని ఎంపిక చేశాం.’ అని బీసీసీఐ తెలిపింది.
Hardik Pandya : చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్‌ను ఉతికారేసిన హార్దిక్ పాండ్య.. 6, 6, 6, 6,4..
ఉమా చెత్రీ ఇప్పటి వరకు టీమ్ఇండియా తరుపున 4 టీ20 మ్యాచులు ఆడింది. 9 పరుగులు చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆమె జూలైలో దక్షిణాఫ్రికాపై టీ20 మ్యాచ్‌తో అరంగ్రేటం చేసింది. కాగా.. ఉమా చెత్రీ దేశవాలీ టీ20 ఛాలెంజర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచింది. 154.00 స్ట్రైక్ రేట్‌తో 231 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు ఆడనుంది. డిసెంబర్ 5న బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. అదే వేదిక పై డిసెంబర్ 8న రెండో వన్డే, డిసెంబర్ 11న పెర్త్ వేదికగా మూడో వన్డే జరగనుంది.
ఆసీస్ పర్యటనకు అప్డేట్ చేసిన భారత మహిళల వన్డే జట్టు..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రియా పునియా, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, మిన్ను మణి, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, టిటాస్ సాధు, అరుంధతీ రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, సైమా ఠాకూర్, ఉమా చెత్రీ (వికెట్ కీపర్)
🚨 News 🚨
Squad Update: Uma Chetry replaces injured Yastika Bhatia#TeamIndia | Read More 🔽
— BCCI Women (@BCCIWomen) November 27, 2024