Hyderabad: హైదరాబాద్‌లో మొట్టమొదటిసారి డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్.. ట్రాఫిక్ ఆంక్షలు

ఇప్పటికే పలు మార్గాల్లో వాహనాలను మళ్లిస్తున్నారు. రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని సైబరాబాద్ పోలీసులు చెప్పారు.

Hyderabad: హైదరాబాద్‌లో మొట్టమొదటిసారి డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్.. ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad - WWE

Updated On : September 8, 2023 / 6:12 PM IST

Hyderabad – WWE: హైదరాబాద్‌లో మొట్టమొదటిసారి వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫైట్లు జరుగుతున్నాయి. డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టాకిల్ పేరుతో ఈ ఈవెంట్ శుక్రవారం రాత్రి 7.30 గంటల నుంచి గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమవుతుంది.

దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇప్పటికే పలు మార్గాల్లో వాహనాలను మళ్లిస్తున్నారు. రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూఈలో 28 మంది అంతర్జాతీయ ఛాంపియన్లు పోటీ పడతారు.

డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ జాన్ సేనా కూడా గచ్చిబౌలికి వచ్చారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత జాన్ సేనా ఇండియాకు వచ్చారు. అలాగే, ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సేథ్ ఫ్రీకిన్ రోలిన్స్, విమెన్ ఛాంపియన్ రియా రిప్లే, డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ సమీ జైన్ హైదరాబాద్ చేరుకున్నారు.

కెవిన్ ఓవెన్స్‌ తోపాటు ఇంటర్‌కాంటినెంటల్ ఛాంపియన్ గుంథర్, జిందర్ మహల్, వీర్, సంగ, డ్రూ మెక్‌ఇంటైర్, బెక్కీ లించ్, నటల్య, మాట్ రిడిల్, లుడ్విగ్ కైజర్ వంటి డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లు హైదరాబాద్ చేరుకున్నారు. ఇండియాలో రెండవ సారి, హైదరాబాద్‌లో మొదటి సారి ఈ ఈవెంట్ జరుగుతోంది. భవిష్యత్తులోనూ ఇండియాలో ఈవెంట్స్ మరిన్ని జరగాలని కోరుకుంటున్నట్లు డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లు చెప్పారు.

 

Sunil Gavaskar: టీమిండియాలో ఎవరు ఉండాలో, ఉండొద్దో చెప్పడానికి మీరెవరండీ?: సునీల్ గవాస్కర్